నాకు టాలీవుడ్ ఇండస్ట్రీపై అసూయగా ఉంది.. కోలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్

కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్(Chiyan Vikram) ఇటీవల ‘తంగలాన్’(Thangalan) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

Update: 2025-03-23 05:11 GMT
నాకు టాలీవుడ్ ఇండస్ట్రీపై అసూయగా ఉంది.. కోలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్
  • whatsapp icon

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్(Chiyan Vikram) ఇటీవల ‘తంగలాన్’(Thangalan) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర ధీర శూరన్-2’(Veera Dheera Sooran-2). అరుణ్ కుమార్(Arun Kumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దుషారా విజయన్ (Dushara Vijayan)హీరోయిన్‌గా నటిస్తోంది. హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా శింబు (Riya Simbu)నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్(G.V. Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు.‘వీర ధీర శూరన్-2’ చిత్రం మార్చి 27న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

ఈ నేపథ్యంలో.. మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అవగా.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విక్రమ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘నాకు టాలీవుడ్ ఇండస్ట్రీపై అసూయగా ఉంది. తెలుగులో బారీ కమర్షియల్ సినిమాలు బ్లాక్ బస్టర్ అవడంతో పాటు చిన్న చిత్రాలు కూడా ఘన విజయాన్ని అందుకుంటున్నాయి. తమిళ పరిశ్రమలో కూడా అలాంటి సినిమాలు రావాలని దానిపైనే కోలీవుడ్ వర్క్ చేస్తుంది. మంచి కంటెంట్ ఉన్న మూవీస్‌ను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆర్టిస్టులుగా మాకు కావాల్సిందే అదే. అయితే ‘వీర ధీర శూరన్-2’మంచి సినిమా మాత్రమే కాదు. ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్ కూడా అందరూ చూసి హిట్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విక్రమ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News