మహారాణిగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్.. వావ్ లుక్ అదిరిపోయిందంటూ నెటిజన్ల కామెంట్స్
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నభా నటేష్(Nabha Natesh) గురించి పరిచయం అక్కర్లేదు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నభా నటేష్(Nabha Natesh) గురించి పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు ‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukunduvate)సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత మాస్ట్రో, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక రామ్ పోతినేని సరసన నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలో నభా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక గత ఏడాది ‘డార్లింగ్’(Darling)చిత్రంలో నటించింది. కానీ హిట్ అందుకోలేకపోయింది. అయినప్పటికీ ఏం నిరాశ చెందకుండా వరుస సినమాల్లో నటిస్తూ అందరినీ అలరించే ప్రయత్నం చేస్తోంది.
ప్రస్తుతం నభా నటేష్ ‘స్వయంభు’(Swayambhu)మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో నిఖిల్(Nikhil Siddhartha) హీరోగా నటిస్తుండగా.. పాన్ ఇండియా స్థాయిలో భరత్ కృష్ణమాచారి దీనిని తెరకెక్కిస్తున్నారు. అయితే సోషియో ఫాంటసీగా రాబోతున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్(Samyuktha) కూడా కీలక పాత్రలో కనిపించనుంది. ఠాగూర్ మధు సమర్ఫణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ‘స్వయంభు’ నుంచి ఇప్పటికే పలు పోస్టర్లు విడుదలై హైప్ క్రియేట్ చేశాయి.
ఇక ఎంత బిజీగా ఉన్నప్పటికీ నభా నటేష్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం పలు ఫొటోషూట్స్‌తో నెటిజన్లు ఫిదా చేస్తోంది. తాజాగా, ఈ భామ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో బ్లూ కలర్ లెహంగా ధరించి మహాల్‌లో మహారాణిలా ఫొటోలకు పోజులిచ్చింది. ఎద, నాభి అందాలు చూపిస్తూ మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లకు చెమటలు పట్టేలా చేస్తోంది. ఇక ఈ పిక్స్ చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.
Read More..
Pooja Hegde: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న పూజా హెగ్డే మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?