ఒక్క సినిమాకు 10 కోట్లు... రష్మిక ఆస్తులు ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే ?

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ రష్మిక మందన్న గురించి తెలియని వారు ఉండరు. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ఇం డస్ట్రీలో టాప్ మోస్ట్

Update: 2025-03-27 06:47 GMT
ఒక్క సినిమాకు 10 కోట్లు... రష్మిక ఆస్తులు ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే  ?
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ అగ్ర హీరోయిన్ రష్మిక మందన్న ( Rashmika Mandanna ) గురించి తెలియని వారు ఉండరు. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ( Tollywood ) ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా మారింది ఈ అందాల తార రష్మిక. చలో, గీత గోవిందం లాంటి సినిమాలు హిట్ కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాన్ని దక్కించుకుంది రష్మిక. అలా క్రమక్రమంగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వెళ్ళింది. అయితే తాజాగా ఈ అందాల తార రష్మిక ఆస్తుల గురించి.. సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

ప్రస్తుతం రష్మిక దగ్గర 70 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఫోర్బ్స్ సంస్థ సంచలన ప్రకటన చేసింది. అంతేకాదు రష్మిక ఆస్తులు అతిత్వరలోనే 100 కోట్లకు చేరుతాయని... ఈ సంస్థ అంచనా కూడా వేసింది. అదే సమయంలో.. రష్మిక కు ఉన్న సొంత ఇళ్ల విషయాలను కూడా పేర్కొంది. బెంగళూరు , కూర్గ్, హైదరాబాద్, గోవా అలాగే ముంబైలో రష్మికకు సొంత ఇండ్లు ఉన్నాయట. అంతేకాదు రష్మిక మందన్న ( Rashmika Mandanna ) ఒక్కో సినిమాకు ఇప్పుడు 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సోషల్ మీడియాలో టాలీవుడ్ సర్కిల్లో ఓ టాక్ నడుస్తోంది. ఈ లెక్కన దక్షిణాది రాష్ట్రాలలో రష్మిక మందన్న టాప్ మోస్ట్ హీరోయిన్ అని చెప్పవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, అల్లు అర్జున్ హీరో గా వచ్చిన పుష్ప మూవీ లో రష్మిక మందన్న ( Rashmika Mandanna ) నటించిన సంగతి తెలిసిందే.

Read More..

స్టైలీష్ లుక్‌లో దర్శనమిచ్చిన స్టార్ హీరోయిన్.. నిన్నిలా చూస్తే దెబ్బకు అతను ప్లాట్ అంటూ కామెంట్స్  

100 కోట్ల హీరోయిన్ తో విజయ్ దేవరకొండ సినిమా?  

Tags:    

Similar News