నీ బండ బావమరిది, బండ ప్రేమ తప్ప ఏమి ఇవ్వగలుగుతాడు.. మెగా హీరో ఇంట్రెస్టింగ్ ట్వీట్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’(Pilla Nuvvu Leni Jeevitham) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ మూవీతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’(Pilla Nuvvu Leni Jeevitham) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ మూవీతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక చివరిగా ‘విరూపాక్ష’(Virupaksha) సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ సినిమాతో మెప్పించాడు. ప్రస్తుతం రోహిత్ కేపీ(Rohit KP) దర్శకత్వంలో ‘సంబరాల ఏటిగట్టు’(Sambara Yetigattu) అనే చిత్రంలో నటిస్తున్నాడు.
ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టైటిల్ గ్లింప్స్‌లో తేజ్ కనిపించిన తీరు చూసి ఇటు ఫ్యాన్స్ సైతం షాకయ్యారు. మొదటిసారిగా తేజ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడని.. దీంతో ఈసారి బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) నటిస్తోంది. అయితే ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై చైతన్య రెడ్డి(chaitanya Reddy), నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇదిలా ఉంటే.. నేడు రామ్ చరణ్(Ram Charan) పుట్టిన రోజు సందర్భంగా సాయి ధరమ్ తేజ్ అతనికి స్పెషల్ విష్ చేశాడు. ఈ మేరకు అతనితో దిగిన క్యూట్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘నీ బండ బావమరిది, బండ ప్రేమ తప్ప ఏమి ఇవ్వగలుగుతాడు.. తీసుకో బావ నా ఈ బండ ప్రేమను.. హ్యాపి బర్త్‌డే రామ్ చరణ్’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దాన్ని చూసిన నెటిజన్లు మీ బాండింగ్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.
Read More..
హ్యాపీ బర్త్‌డే మై డియర్ బ్రదర్ అంటూ గ్లోబల్ స్టార్‌కి విష్ చేసిన యంగ్ టైగర్ .. ట్వీట్ వైరల్