Pooja Hegde: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న పూజా హెగ్డే మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయింది. అంతేకాకుండా పలు హిట్స్ సాధించి బుట్టబొమ్మగా గుర్తింపు తెచ్చుకుంది.

Update: 2025-03-26 02:11 GMT
Pooja Hegde: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న పూజా హెగ్డే మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
  • whatsapp icon

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయింది. అంతేకాకుండా పలు హిట్స్ సాధించి బుట్టబొమ్మగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక వరుసగా మూడు చిత్రాలు డిజాస్టర్ కావడంతో సౌత్‌కి దూరం అయింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసినప్పటికీ ఫేమ్ తెచ్చుకోలేకపోయింది. ఇటీవల ‘దేవా’(Deva )మూవీతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో షాహిద్ కపూర్ (Shahid Kapoor)హీరోగా నటించగా.. దీనిని రోషన్ అండ్రూస్ తెరకెక్కించారు. సిద్ధార్థ్ రాయ్ కపూర్, ఉమేష్ కేఆర్ భన్సల్ ఈ సినిమాను నిర్మించారు. అయితే ‘దేవా’చిత్రం జనవరి 31న థియేటర్స్‌లోకి వచ్చింది. పూజా హెగ్డే ఆశలన్నీ అడియాశలు అయ్యాయి . ‘దేవా’బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

తాజాగా, ‘దేవా’మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రెడీ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. రెండు నెలల తర్వాత ఈ డిజాస్టర్ చిత్రం మార్చి 28 నుంచి ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం పూజా హెగ్డే వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తోంది. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. త్వరలో‘ రెట్రో’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో పాటు పూజా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ మూవీలోనే కీలక పాత్రలో కనిపించనుంది.

Read More..

ఇన్నాళ్లకు నన్ను గుర్తించారు.. వారి ప్రేమను అదృష్టంగా భావిస్తున్నా.. క్రేజీ బ్యూటీ ఎమోషనల్ కామెంట్స్  

Tags:    

Similar News