ఖానాపురంలో పట్టపగలే దొంగల హల్చల్..
అనంతగిరి మండలం ఖానాపురం గ్రామంలో పట్టపగలే దొంగలు హల్చల్ చేసి తాళం వేసి ఉన్న ఇండ్లలో నగదు డబ్బులు చోరీ చేశారు.

దిశ, అనంతగిరి : అనంతగిరి మండలం ఖానాపురం గ్రామంలో పట్టపగలే దొంగలు హల్చల్ చేసి తాళం వేసి ఉన్న ఇండ్లలో నగదు డబ్బులు చోరీ చేశారు. గ్రామానికి చెందిన తొర్రికొండ కృష్ణకుమారి, కొంగర గంగా ఇంట్లో నగలు డబ్బులు చోరీ చేసినట్లు సమాచారం. కృష్ణకుమారి ఇంట్లో రెండు జతల దిద్దులు, బంగారు ఉంగరంతో పాటు డబ్బులు, మంగ ఇంట్లో కూడా బంగారం, డబ్బులు పోయినట్లుగా సమాచారం. ఈ ఇద్దరు మహిళలకు కూడా పొట్టకూటి కోసం కూలి పనికి వెళుతూ ఉంటారు.
రోజు మాదిరిగానే శనివారం సైతం పనికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడినట్టుగా బాధితులు తెలుపుతున్నారు. ఒకే రోజు రెండు ఇండ్లలో దొంగతనాలు జరగడంతో గ్రామస్తులు ఒకింత భయాందోళనకు గురవుతున్నారు. ఇది బయట నుంచి వచ్చి దొంగతనం చేసిన వ్యక్తులా.. లేక గ్రామంలోనే తెలిసిన వారు చేసిన పని నా అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ రెండు దొంగతనాలకు సంబంధించి ఎటువంటి సమాచారం అందలేదని పోలీసులు పేర్కొన్నారు.