టీడీపీ విశాఖ ర్యాలీకి అనుమతి నిరాకరణ

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఇవాళ విశాఖలో నిర్వహించనున్న ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. చంద్రబాబు విజయనగరం జిల్లాలో ప్రజాచైతన్య యాత్రకు వెళ్తూ మార్గమధ్యంలో పెందుర్తిలో ఆగి భూసమీకరణ బాధితులతో మాట్లాడతారని ఇప్పటికే టీడీపీ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 9 గంటలకు చంద్రబాబు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ భారీ ర్యాలీ నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలు నిర్ణయించారు. కానీ, పోలీసు అధికారులు ర్యాలీకి అనుమతివ్వకుండా, కార్యక్రమాలకు మాత్రం షరతులతో కూడిన అనుమతి […]

Update: 2020-02-26 20:01 GMT

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఇవాళ విశాఖలో నిర్వహించనున్న ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. చంద్రబాబు విజయనగరం జిల్లాలో ప్రజాచైతన్య యాత్రకు వెళ్తూ మార్గమధ్యంలో పెందుర్తిలో ఆగి భూసమీకరణ బాధితులతో మాట్లాడతారని ఇప్పటికే టీడీపీ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 9 గంటలకు చంద్రబాబు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ భారీ ర్యాలీ నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలు నిర్ణయించారు. కానీ, పోలీసు అధికారులు ర్యాలీకి అనుమతివ్వకుండా, కార్యక్రమాలకు మాత్రం షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. చంద్రబాబు వెంట 50 మందికి మించి నాయకులు ఉండకూడదనీ, ఎక్కువ సంఖ్యలో వాహనాలు ఉపయోగించకూడదని ఆంక్షలు విధించారు. కాగా, ర్యాలీకి అనుమతి కోసం రెండ్రోజులుగా ప్రయత్నిస్తున్నట్టు టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ తెలిపారు. పోలీసులు కావాలనే అనుమతి ఇవ్వలేదని గణేశ్ ఆరోపించారు.

Tags:    

Similar News