కీలక నిర్ణయం.. వర్జీనియాలో మరణ శిక్ష రద్దు

వాషింగ్టన్: అమెరికా దక్షిణాదిలోనూ మరణదండనపై వ్యతిరేకత పెరుగుతున్నది. మరణ శిక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన వర్జీనియా తొలి దక్షిణాది రాష్ట్రంగా నిలిచింది. శిక్షను రద్దు చేస్టున్న చట్టంపై రాష్ట్ర గవర్నర్ రాల్ఫ్ నోర్తామ్ బుధవారం సంతకం చేశారు. మరణ శిక్షను రద్దు చేయాల్సిన నైతిక బాధ్యత తమకు ఉన్నదని వివరించారు. డెత్ పెనాల్టీ మినహా వర్జీనియా చరిత్రపై ప్రజలు గర్వపడుతారని, అందుకే ఆ మరకనూ చెరిపేయదలిచామని పేర్కొన్నారు. 1608లో బ్రిటీష్ కాలనీగా అమెరికా మారినప్పటి నుంచి అత్యధిక(సుమారు […]

Update: 2021-03-25 11:53 GMT

వాషింగ్టన్: అమెరికా దక్షిణాదిలోనూ మరణదండనపై వ్యతిరేకత పెరుగుతున్నది. మరణ శిక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన వర్జీనియా తొలి దక్షిణాది రాష్ట్రంగా నిలిచింది. శిక్షను రద్దు చేస్టున్న చట్టంపై రాష్ట్ర గవర్నర్ రాల్ఫ్ నోర్తామ్ బుధవారం సంతకం చేశారు. మరణ శిక్షను రద్దు చేయాల్సిన నైతిక బాధ్యత తమకు ఉన్నదని వివరించారు. డెత్ పెనాల్టీ మినహా వర్జీనియా చరిత్రపై ప్రజలు గర్వపడుతారని, అందుకే ఆ మరకనూ చెరిపేయదలిచామని పేర్కొన్నారు. 1608లో బ్రిటీష్ కాలనీగా అమెరికా మారినప్పటి నుంచి అత్యధిక(సుమారు 1400) మరణ శిక్షలు వర్జీనియాలో అమలు చేశారు.

ఈ సందర్భంగా గవర్నర్ నోర్తామ్ మాట్లాడుతూ, మరణ శిక్ష తప్పు నిర్ణయమని, ఈ శిక్ష విధింపులోనూ వివక్ష ఉండేదని వివరించారు. అమాయకులు, నిందిత నల్లజాతీయులు పెద్దమొత్తంలో ఈ శిక్షతో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వ్యవస్థ ఎప్పటికీ సరైన దిశలోనే వెళ్తుందని చెప్పలేమని, ఒక కేసులో 100శాతం మనం సరిగ్గానే ఉన్నామన్న కచ్చితత్వం లేనప్పుడు మరణ దండ విధించడం సరికాదని పేర్కొన్నారు. 2000వ సంవత్సరం నుంచి మరణ శిక్ష పడిన 377 మందిలో 296 మంది నల్లజాతీయులేనని అన్నారు. ఒక కేసులో శ్వేతజాతీయుడు బాధితుడైనప్పుడు మూడు రెట్లు ఎక్కువగా నల్లజాతీయులకు ఈ శిక్ష పడిందని వివరించారు.

Tags:    

Similar News