విరాట్ అంపైర్లతో మర్యాదగా ప్రవర్తించాలి : డేవిడ్ లాయిడ్

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దురుసుగా ఉంటాడో అందరికీ తెలిసిన విషయమే. తనకు కోపం వస్తే దాన్ని వెంటనే ప్రదర్శిస్తుంటాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో కూడా పలు మార్లు ఆ జట్టు ఆటగాళ్లతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అంపైర్లతో కూడా వాగ్వివాదాలకు దిగుతున్నాడు. దీనిపై పలు విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, అంపైర్, కామెంటేటర్ అయిన డేవిడ్ లాయిడ్ కూడా కోహ్లీ ప్రవర్తనపై విరుచుకపడ్డాడు. […]

Update: 2021-03-25 07:06 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దురుసుగా ఉంటాడో అందరికీ తెలిసిన విషయమే. తనకు కోపం వస్తే దాన్ని వెంటనే ప్రదర్శిస్తుంటాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో కూడా పలు మార్లు ఆ జట్టు ఆటగాళ్లతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అంపైర్లతో కూడా వాగ్వివాదాలకు దిగుతున్నాడు. దీనిపై పలు విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, అంపైర్, కామెంటేటర్ అయిన డేవిడ్ లాయిడ్ కూడా కోహ్లీ ప్రవర్తనపై విరుచుకపడ్డాడు. ఒక ఆంగ్ల పత్రికలో తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

‘కోహ్లీ అంపైర్లకు గౌరవం ఇవ్వడం లేదు.. డీఆర్ఎస్ విషయాల్లో ఒత్తిడి తెస్తున్నాడు. ఇంగ్లాండ్ క్రికెటర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. ఇంగ్లాండ్ జట్టు అంపైర్లపై ఒత్తిడి తెస్తున్నదని కోహ్లీ అంటున్నాడు. కానీ వాస్తవానికి అతడే తీవ్రమైన ఒత్తిడి పెడుతున్నాడు. తొలి వన్డేలో జాస్ బట్లర్‌తో కూడా గొడవపడ్డాడు. కానీ నోరు లేని ఐసీసీ ఈ విషయంలో ఏం చేయలేకపోయింది’ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించాడు. క్రికెట్‌లో కూడా ఆటగాళ్ల ప్రవర్తన విషయంలో ఎల్లో, రెడ్ కార్డులు ప్రవేశపెట్టాలి.. అప్పుడే అంపైర్లు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలుగుతారని లాయిడ్ సూచించాడు.

Tags:    

Similar News