క్వార్టర్స్‌కు సింధు.. లక్ష్యసేన్, గాయత్రి జోడీ కూడా

సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

Update: 2024-11-28 12:46 GMT

దిశ, స్పోర్ట్స్ :సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. లక్నో వేదికగా జరుగుతున్న టోర్నీ సింధు ఉమెన్స్ సింగిల్స్‌లో వరుసగా రెండో విజయాన్ని సాధించింది. బుధవారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో ఆమె 21-10, 12-21, 21-15 తేడాతో సహచర క్రీడాకారిణి ఐరా శర్మపై పోరాడి గెలిచింది.ఐరా శర్మ నుంచి సింధు గట్టి పోటీ ఎదుర్కొంది. 49 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో నిర్ణయాత్మక మూడో గేమ్‌‌లో ఆమె మ్యాచ్‌ను దక్కించుకుంది.

మరో మ్యాచ్‌లో యువ షట్లర్ ఉన్నతి హుడా 21-18, 22-20 తేడాతో 4వ సీడ్ పోర్న్‌పిచా చోయికీవాంగ్(థాయిలాండ్)కు షాకిచ్చింది. మెన్స్ సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్ కూడా క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ప్రీక్వార్టర్స్‌లో ఇజ్రాయిల్‌కు చెందిన డేనియల్ డుబోవెంకో‌ను 21-14, 21-13 తేడాతో ఓడించాడు. ఉమెన్స్ డబుల్స్‌లో గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ 21-13, 21-10 తేడాతో మరో భారత జంట అశ్విని భట్-శిఖా గౌతమ్‌ ద్వయాన్ని ఓడించి ముందడుగు వేసింది.

వీరితోపాటు ఉమెన్స్ సింగిల్స్‌లో తస్నిమ్ మిర్, శ్రియాన్షి, మెన్స్ సింగిల్స్‌లో ఆయుశ్ శెట్టి, రిత్విక్, మీరాబా లువాంగ్ మైస్నమ్, ప్రియాన్షు క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. ఉమెన్స్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో-అశ్విని, ప్రియా-శ్రుతి, రుతపర్ణ-శ్వేతపర్ణ జంటలు, మెన్స్ డబుల్స్‌లో పృథ్వీ-సాయి ప్రతీక్, ఇషాన్-శంకర్ ప్రసాద్, హరిహరన్-రుబాన్ కుమార్ జోడీలు, మి‌క్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో, సతీశ్ కుమార్-ఆద్య జంటలు ముందడుగు వేశాయి.

Tags:    

Similar News