సచిన్ సెంచరీల రికార్డు బద్దలుకొట్టేది కోహ్లీనే !

దిశ, స్పోర్ట్స్ : క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డును బద్దలు కొట్టేది టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే అని ఆస్ట్రేలియన్ మాజీ పేసర్ బ్రెట్‌లీ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ప్రపంచం క్రికెట్‌లో కోహ్లీని మించిన ఫిట్‌నెస్, టెక్నిక్ ఎవరికీ లేవని బ్రెట్‌లీ చెప్పుకొచ్చాడు. తన ఆటను ఇలాగే కాపాడుకుంటే మరో ఏడెనిమిది ఏండ్లలో సచిన్ రికార్డులన్నీ బద్దలు కొట్టడం ఖాయమన్నాడు. కోహ్లీకి ఫిట్‌నెస్‌తో పాటు మానసిక బలం ఎక్కువని.. ఎలాంటి కఠిన పరిస్థితుల్లో అయినా […]

Update: 2020-04-25 09:01 GMT

దిశ, స్పోర్ట్స్ :

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డును బద్దలు కొట్టేది టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే అని ఆస్ట్రేలియన్ మాజీ పేసర్ బ్రెట్‌లీ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ప్రపంచం క్రికెట్‌లో కోహ్లీని మించిన ఫిట్‌నెస్, టెక్నిక్ ఎవరికీ లేవని బ్రెట్‌లీ చెప్పుకొచ్చాడు. తన ఆటను ఇలాగే కాపాడుకుంటే మరో ఏడెనిమిది ఏండ్లలో సచిన్ రికార్డులన్నీ బద్దలు కొట్టడం ఖాయమన్నాడు. కోహ్లీకి ఫిట్‌నెస్‌తో పాటు మానసిక బలం ఎక్కువని.. ఎలాంటి కఠిన పరిస్థితుల్లో అయినా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అతని సొంతమని బ్రెట్‌లీ అన్నాడు. అయితే, ఇప్పటికీ అత్యధిక పరుగులు, సెంచరీల రికార్డు సచిన్ పేరిటే ఉన్నాయి. కోహ్లీకి పోటీగా స్మిత్ వంటి ప్లేయర్లు ఉన్నా.. కోహ్లీకే అవకాశాలెక్కువని బ్రెట్ లీ చెప్పాడు. సచిన్ టెస్టుల్లో 51, వన్డేల్లో 49 సెంచరీలు చేయగా.. కోహ్లీ టెస్టుల్లో 27, వన్డేల్లో 43 సెంచరీలు చేశాడు. మొత్తంగా చూస్తే సచిన్ కంటే కోహ్లీ 30 సెంచరీలు వెనకబడ్డాడు.

Tags: Sachin Tendulkar, Indian Cricket Team, Cricket, BCCI, Brett Lee, Virat Kohli

Tags:    

Similar News