నిర్లక్ష్యమేల.. నీ కర్తవ్యం కాదా ?
దిశ, వెబ్‌డెస్క్ : 199 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్ గురించి ప్రస్తుతం పరిచయ వ్యాఖ్యాలు చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే కంటికి కనిపించని ఆ వైరస్.. ప్రపంచాన్ని ఏ విధంగా ముప్పుతిప్పలు పెడుతుందో చూస్తూనే ఉన్నాం. ఓ వైపు కరోనా వైరస్ పుట్టుకకు కేంద్ర బిందువైన చైనా ఈ ఉపద్రవం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుండగా.. మరోవైపు ఇతర దేశాలు తమ శక్తి మేర పోరాటం చేస్తున్నాయి. ఈ వైరస్ తీవ్రతను ముందస్తుగా అంచనా వేయలేని ఇటలీ, స్పెయిన్ […]
దిశ, వెబ్‌డెస్క్ : 199 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్ గురించి ప్రస్తుతం పరిచయ వ్యాఖ్యాలు చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే కంటికి కనిపించని ఆ వైరస్.. ప్రపంచాన్ని ఏ విధంగా ముప్పుతిప్పలు పెడుతుందో చూస్తూనే ఉన్నాం. ఓ వైపు కరోనా వైరస్ పుట్టుకకు కేంద్ర బిందువైన చైనా ఈ ఉపద్రవం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుండగా.. మరోవైపు ఇతర దేశాలు తమ శక్తి మేర పోరాటం చేస్తున్నాయి. ఈ వైరస్ తీవ్రతను ముందస్తుగా అంచనా వేయలేని ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలు.. తమ దేశ పౌరులను రక్షించుకోలేక తల్లడిల్లుతున్నాయి. ఇక భారత్‌లో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాల సూచనలు పాటిస్తూ బాధ్యతతో మెలగాల్సిన జనం.. దీన్ని బరువుగా భావిస్తున్నారు. పరిస్థితి తీవ్రత తెలిసిన వారు సైతం సమస్యను లైట్ తీసుకుంటూ పరోక్షంగా వైరస్ వ్యాప్తికి కారణమయ్యేలా ప్రవర్తిస్తున్నారు.
ఎందుకీ నిర్లక్ష్యం..
లాక్ డౌన్ విధించి ఆఫీసులు, పని ప్రదేశాలన్నీ మూసేసినా.. తరచూ వాహనాలు రోడ్డెక్కుతూనే ఉన్నాయి. ప్రజల నిత్యావసరాల కొనుగోలు కోసం ప్రభుత్వం కావలసిన ఏర్పాట్లు చేస్తున్నా.. మార్కెట్లలో జనాలు గుంపులు గుంపులుగా తిరుగుతూనే ఉన్నారు. ‘సామాజిక దూరం పాటించడమే కరోనా నివారణకు సరైన మందు’ అని నెత్తీ నోరు బాదుకొని చెబుతున్నా జనాలకు ఎక్కడం లేదు. ప్రస్తుత కంఫర్ట్ కోసం తమ భవిష్యత్తుతో పాటు పక్కవారి భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నారు. సిల్లీ రీజన్స్‌తో బయటికొస్తూ పోలీసుల లాఠీకి పని కల్పిస్తున్నారు. ఈ విధంగా బయట తిరుగుతున్న ఓ వాహనదారుడిన్ని పోలీసులు ఆపి ప్రశ్నిస్తే.. అతడు చెప్పిన సమాధానం వింటే జనాల మైండ్ సెట్ ఏంటో తెలిసిపోతోంది. ‘బంజారాహిల్స్ నుంచి గోధుమ పిండి కొనేందుకు శ్రీనగర్ కాలనీకి వచ్చాడంట.. గోధుమ పిండి అక్కడ దొరకదా అంటే ‘ఆశీర్వాద్ గోధుమ పిండి’ దొరకలేదంట.. ఇదండీ వరస ! ఇక చదువుకున్న యువతకైతే ఈ తరహా ఘటనల్లో పూర్తి క్రెడిట్ ఇవ్వాల్సిందే. ముఖానికి కనీసం మాస్కులు కూడా లేకుండా.. ఒక్కో బండిపై ఇద్దరు ముగ్గురు తిరుగుతూ లాక్ డౌన్‌ను వెకేషన్ లాగా ఎంజాయ్ చేస్తున్నారు. తమ దాకా రాలేదనే భావనే వీరిలో కనిపిస్తోంది తప్ప, వస్తే ఆ పరిమాణాలు ఎలా ఉంటాయనే దాని గురించి ఆలోచిస్తున్నట్టు లేదు.
గ్రామాలే ఆదర్శం..
‘గ్రామాలే దేశానికి పట్టు కొమ్మలన్నట్టుగా’.. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లోనే స్వీయ నిర్బంధాన్ని విధిగా పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే లాక్ డౌన్ పీరియడ్‌లో ఉద్యోగులకు సెలవులతో కూడిన వేతనం లభించే అవకాశం ఉంది. కానీ రైతులకు ఆ చాన్స్ లేదు. పైగా పంట కోతల సమయం, మరోవైపు వడగండ్ల వానల భయం. ఏ మాత్రం పరిస్థితులు అనుకూలించకున్నా ఆరుగాలం శ్రమించిన పంట ఆగమయ్యే అవకాశముంది. అయినా ధైర్యంగా కరోనా కట్టడికి తమ వంతు ప్రయత్నం చేస్తుండటం అభినందనీయం.
ఈ వైరస్ సృష్టిస్తున్న అలజడి గురించి పూర్తి స్థాయిలో తెలియని నిరక్షరాస్యులు సైతం.. ఆ నోటా ఈ నోటా విని తగు జాగ్రత్తలు పాటిస్తుంటే, అటువంటి వారికి చెప్పాల్సిన చదువుకున్న వారు మాత్రం నిర్లక్ష్యంగా వ్యహరిస్తుండటం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. కొద్ది రోజులు ఓపికపడితే నీతో సహా నీ చుట్టుపక్కల వారికి.. తద్వారా దేశానికే మేలు చేసిన వాడివి అవుతావ్.. ఏ పోలీసో వచ్చి నీ బాధ్యతను గుర్తు చేసేదాకా చూడకు. నీకు నువ్వే సామాజిక దూరాన్ని పాటించు. ఇంకెంత.. మరో రెండు వారాలు అంతే !
Tags : Corona, Lock down, villages active role, social distance