అందరూ శిక్ష అనుభవిస్తారు : డిప్యూటీ స్పీకర్ రఘురామ
రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు (Raghurama Custodial Torcher Case)లో సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ (Vijay Paul Arrest)ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ స్పందించారు.
దిశ, వెబ్ డెస్క్: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు (Raghurama Custodial Torcher Case)లో సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ (Vijay Paul Arrest)ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ స్పందించారు. విజయ్ పాల్ అరెస్టును స్వాగతిస్తున్నామని తెలిపారు. కస్టడీలో తనను హింసించి, కొట్టిన వారంతా జైలుకి వెళ్లడం ఖాయమన్నారు. అలాగే సీఐడీ మాజీ చీఫ్ సునీల్ (CID Ex Chief Suneel) పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని పోలీసుల్ని కోరారు. అతనికి చాలా వ్యాపారాలున్న నేపథ్యంలో దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందని, నిందితులు తప్పించుకోకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు. హింసాకాండలో నాటి ముఖ్యమంత్రి కోరికలు తీర్చేందుకు తనపై దారుణానికి పాల్పడ్డారని రఘురామ మరోసారి ఆరోపించారు. తనను హింసించిన ఐపీఎస్ లు, వారి వెనుక ఉన్న నాయకులు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారని తెలిపారు.