Bapatla: ఆక్రమణల చెరలో దిగమర్రు జాతీయ రహదారి 216
చీరాల మండలం తోటవారిపాలెం పంచాయతీ పరిధిలో దిగమర్రు జాతీయ రహదారి 216 పై హిందుస్థాన్ పెట్రోలియం సంస్థకు సంబంధించిన పెట్రోల్ బంకు ఇటీవల ప్రారంభించగా.. వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలో వేటపాలెం జంక్షన్ వద్ద మరో పెట్రోల్ బంక్ నూతనంగా నిర్మిస్తున్నారు.
దిశ ప్రతినిధి, బాపట్ల జిల్లా: చీరాల మండలం తోటవారిపాలెం పంచాయతీ పరిధిలో దిగమర్రు జాతీయ రహదారి 216 పై హిందుస్థాన్ పెట్రోలియం సంస్థకు సంబంధించిన పెట్రోల్ బంకు ఇటీవల ప్రారంభించగా.. వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలో వేటపాలెం జంక్షన్ వద్ద మరో పెట్రోల్ బంక్ నూతనంగా నిర్మిస్తున్నారు. పెట్రోల్ బంక్ యాజమాన్యాలు జాతీయ రహదారి216 ని ఆక్రమించడమే కాకుండా రహదారికి అడ్డంగా అక్రమ నిర్మాణాలను నిర్మించినప్పటికీ నేషనల్ హైవే అథారిటీ స్పందించకపోగా పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు ఎన్ఓసీలు మంజూరు చేయటం నేషనల్ హైవే అథారిటీ నిర్లక్ష్యానికి, అవినీతికి అద్దం పడుతోంది.
ఆక్రమణల విషయమై స్థానిక రెవిన్యూ అధికారులను సంప్రదించగా, ఎన్.హెచ్.ఏ.ఐ సిబ్బంది రెవెన్యూ వారికి ఏమి సంబంధం అంటూ ప్రశ్నిస్తున్నారంటూ వేటపాలెం తహాశీల్దార్ తెలిపారు. హైవే ఆక్రమణలపై స్థానిక ప్రజలు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడం పట్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల హైవే ఆక్రమణము సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయంతో సహా పది ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులను ఫిబ్రవరి 4వ తేదీ విచారణకు హాజరు కావలసిందిగా ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త నోటీసులు కూడా జారీచేసింది. చీరాల నియోజకవర్గంలో వేటపాలెం, చిన్నగంజాం మండలాల పరిధిలో జాతీయ రహదారి 216 పై పలుచోట్ల ఆక్రమణలు జరిగి అక్రమ నిర్మాణాలు చేపట్టినప్పటికీ నేషనల్ హైవే అథారిటీ, రెవిన్యూ అధికారులు మౌనం వహించడం పట్ల స్థానిక ప్రజలలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.