సదర్మాట్ బ్యారేజీ వద్ద టెన్షన్ టెన్షన్ .. చావనైన చస్తాం అంటూ నిరసన( వీడియో)
దిశ, నిర్మల్ రూరల్: గోదావరి నదిపై నిర్మిస్తున్న సదర్మాట్ బ్యారేజీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా మమడ మండలంలోని పోన్కల్ గ్రామ సమీపంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న సదర్మాట్ బ్యారేజీలో ముంపునకు గురై భూములు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు నష్టపరిహారాన్ని అందించాలని గురువారం బాధిత రైతులు పనులను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గత రెండు మూడు నెలల క్రితం గ్రామానికి వచ్చిన మంత్రి ఇంద్రకరణ్ […]
దిశ, నిర్మల్ రూరల్: గోదావరి నదిపై నిర్మిస్తున్న సదర్మాట్ బ్యారేజీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా మమడ మండలంలోని పోన్కల్ గ్రామ సమీపంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న సదర్మాట్ బ్యారేజీలో ముంపునకు గురై భూములు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు నష్టపరిహారాన్ని అందించాలని గురువారం బాధిత రైతులు పనులను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గత రెండు మూడు నెలల క్రితం గ్రామానికి వచ్చిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గ్రామ, మండల, జిల్లా ప్రజాప్రతినిధులు హామీతో ఉన్నామని ప్రభుత్వం పరిహారం అందించకుంటే మేము మీతో పాటు ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటామన్నారు. కానీ ఇప్పుడు ప్రజాప్రతినిధులు, నాయకులు ఆ మాట దాటివేత ధోరణి సరికాదన్నారు. సంఘటన స్థలాన్ని సొన్ సీఐ జీవన్ రెడ్డి చేరుకొని ఎలాంటి గొడవలు చోటు చేసుకోకుండా, శాంతి యుత వాతావరణంలో నిరసన తెలపాలి అన్నారు. అనంతరం సంబంధిత బ్యారేజీ నిర్వాహకులు పనులు ఆపివేయడంతో ముంపు బాధితులు తమ నిరసనను ఆపివేశారు.