జోడేఘాట్ ఫారెస్ట్ రేంజ్ లో పులి సంచారం..

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలం రాసి మెట్ట అటవీ

Update: 2024-11-18 14:24 GMT

దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలం రాసి మెట్ట అటవీ ప్రాంతంలో పులి సంచారం ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. సోమవారం ఆ ప్రాంతంలో పులి పాదముద్రలతో పాటు పులి దాడిలో మరణించిన ఆవు కళేబరాన్ని సైతం గుర్తించారు. ఆసిఫాబాద్ ఉట్నూర్ డీఎఫ్ వోలు నీరజ్ కుమార్, ప్రశాంత్ బాజీరావు పాటిల్ ఆ ప్రాంతాలను పర్యవేక్షించారు. పులి రాసి మెట్ట అటవీ ప్రాంతంలోనే సంచారిస్తోందని, బేస్ క్యాంప్ లు ఏర్పాటు చేసి, పులి అడుగు జాడలను ట్రాకింగ్ చేయాలని ఆదేశించారు. అదే సమయంలో పరిసర గ్రామాల్లో డప్పు చాటింపు వేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు, రైతులు అప్రమత్తతో ఉండాలని కోరారు. ఆదివారం ఉట్నూర్ రాజుల గూడ ప్రాంతంలో ఎద్దు పై దాడి చేసిన పులి ఇటు వచ్చి ఉండవచ్చని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.


Similar News