పూర్తిస్థాయిలో కోత వచ్చాకనే యంత్రాలను వినియోగించాలి : అదనపు కలెక్టర్ దీపక్ తివారీ

వరి పొలం పూర్తి కోత దశకు వచ్చిన తర్వాతనే యంత్రాలు వినియోగించి

Update: 2024-11-18 13:45 GMT

దిశ, ఆసిఫాబాద్ : వరి పొలం పూర్తి కోత దశకు వచ్చిన తర్వాతనే యంత్రాలు వినియోగించి పంట కోయించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లో కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, వివిధ శాఖల అధికారులతో కలిసి హార్వెస్టర్ వాహనాల యజమానులతో ఖరీఫ్ వరి కోతలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రస్తుతం వరి కోతలు సాగుతున్నందున హార్వెస్టర్ యజమానులు పంట పూర్తిగా కోతకు వచ్చిన తర్వాత కోయడం ద్వారా తేమశాతం, తాలు, గడ్డి లేకుండా నాణ్యమైన పంట వచ్చే అవకాశం ఉందని, రైతు నేస్తం ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి కొనుగోలు కేంద్రానికి వెళ్లి రైతులకు తగు సూచనలు ఇవ్వాలని సూచించారు. రైతుల సౌకర్యార్థం జిల్లాలో 34 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు. అధికారులు సమన్వయంతో వ్యవహరించి కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.


Similar News