వైఎస్ఆర్ అక్కడ కనిపిస్తోన్నరని విజయమ్మ కంటతడి
దిశ, తెలంగాణ బ్యూరో : ఈ ఆత్మీయ సమ్మేళనం రాజకీయ పార్టీ కాదని, రాజకీయాలకతీతంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభ మాత్రమేనని వైఎస్ విజయమ్మ అన్నారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడుతూ భావోద్వేగంతో కంటతడి పెట్టారు. మేము ఎక్కడికి వెళ్లినా మమ్మల్ని ఆదరించారని, మీ అందరికీ రుణపడి ఉంటామని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక సందర్భంలో వైఎస్సార్ పేరు ఇప్పటికీ వినిపిస్తోంది. ఆయన బతికుంటే ఇలా జరిగేది […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఈ ఆత్మీయ సమ్మేళనం రాజకీయ పార్టీ కాదని, రాజకీయాలకతీతంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభ మాత్రమేనని వైఎస్ విజయమ్మ అన్నారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడుతూ భావోద్వేగంతో కంటతడి పెట్టారు. మేము ఎక్కడికి వెళ్లినా మమ్మల్ని ఆదరించారని, మీ అందరికీ రుణపడి ఉంటామని అన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక సందర్భంలో వైఎస్సార్ పేరు ఇప్పటికీ వినిపిస్తోంది. ఆయన బతికుంటే ఇలా జరిగేది కాదు.. చాలా అభివృద్ధి చేసేవారు అనే మాట వినిపిస్తోంది అన్నారు. ఉభయ రాష్ట్రంలో ఏ రాయిని అడిగినా నీ పేరే వినిపిస్తోంది అని రాహుల్ గాంధీ అన్నారని, తమ పార్టీ ఈ స్థాయిలో ఉందంటే కారణం వైఎస్సార్ అని మన్మోహన్ సింగ్ అన్నారని గుర్తు చేశారు. నేటి ప్రధాని మోడీ సైతం బీజేపీ జెండాను ఎవరి కోసం అవనతం చేయలేదు.. కానీ వైఎస్సార్ లాంటి వ్యక్తి మరణం తరువాత బీజేపీ జెండాను అవనతం చేశాం అని అన్నారని విజయమ్మ తెలిపారు. అందరూ ఆయన ఖ్యాతిని పొగిడినా వారేనని, అన్ని సంక్షేమ పథకాల్లో ఆయన కనిపిస్తారని విజయమ్మ భావోద్వేగంతో చెప్పారు.