Harish Rao: కేసీఆర్ అంటే ఒక చరిత్ర.. కేసీఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో హరీష్ రావు

కేసీఆర్ అంటే మరిచిపోలేని ఒక చరిత్ర అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS leader Harish Rao) అన్నారు.

Update: 2024-11-18 18:33 GMT
Harish Rao: కేసీఆర్ అంటే ఒక చరిత్ర.. కేసీఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో హరీష్ రావు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: కేసీఆర్ అంటే మరిచిపోలేని ఒక చరిత్ర అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS leader Harish Rao) అన్నారు. జబర్థస్త్ కమీడియన్ రాకింగ్ రాకేష్(Rocking Rakesh) కేశవ చంద్ర సేన్(Keshav Chandra Sen) (కేసీఆర్)(KCR) అనే సినిమాలో నటించి, నిర్మించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఇవాళ జరిగింది. దీనికి హజరైన హరీష్ రావు.. మాజీసీఎం కేసీఆర్(Former CM KCR) గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తెలంగాణ(Telangana)ను తేవడమే గాక పదేళ్లు అద్భుతంగా పాలించారని తెలిపారు. తెలంగాణలో ప్రతీ పల్లెను అభివృద్ది పథం వైపు నడింపించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని, పల్లెలతో పాటు హైదరాబాద్ ను అభివృద్ధి చేశారని తెలిపారు. అంతేగాక తెలంగాణను దేశానికే దిక్సూచిగా నిలబెట్టారని, కేసీఆర్ వల్లే ఇదంతా సాధ్యమైందని హరీశ్ రావు అన్నారు.

Tags:    

Similar News