CAG: కాగ్ నూతన చీఫ్‌గా ఐఏఎస్ కె.సంజయ్ మూర్తి నియామకం

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(Comptroller and Auditor General) పదవిలో తెలుగు అధికారి(Telugu Officer) నియామకం అయ్యారు.

Update: 2024-11-18 18:02 GMT

దిశ, వెబ్ డెస్క్: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(Comptroller and Auditor General) పదవిలో తెలుగు అధికారి(Telugu Officer) నియామకం అయ్యారు. కాగ్‌ కు కొత్త చీఫ్(CAG Chief) గా అమలాపురానికి చెందిన ఐఏఎస్ అధికారి కె. సంజయ్ మూర్తి(IAS Officer K.Sanjay Murthy)ని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ మూర్తిని కాగ్ చీఫ్ గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) నియమించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంజయ్ మూర్తి హిమాచల్ ప్రదేశ్ క్యాడర్(Himachal Pradesh Cadre) నుంచి ఐఏఎస్ గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన కేంద్ర విద్యాశాఖలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నియామకం మేరకు ఈ నెల 21న ఐఏఎస్ సంజయ్ మూర్తి కాగ్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం కాగ్ చీఫ్ గా ఉన్న గిరీష్ చంద్ర ముర్ము(Girish Chandra Murmu) పదవీకాలం నవంబర్ 20 తో ముగియనుండటంతో ఈ పదవిలో కేంద్రం సంజయ్ కుమార్ ను నియమించింది.

Tags:    

Similar News