రియల్ హీరోస్ తో రౌడీ వీడియో కాన్ఫరెన్స్

రౌడీ పోలీసుల చర్యలను అభినందిస్తున్నారు. కరోనా మహమ్మారి పై పోరులో మనకు రక్షకులుగా మారిన పోలీసులే నిజమైన హీరోలు అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో విజయ్ దేవరకొండ హైదరాబాద్ లో గ్రౌండ్ లెవెల్ పోలీసులతో ఇంటరాక్ట్ అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ… వారిని బూస్ట్ చేసే ప్రయత్నం చేశారు. లాక్ డౌన్ మే 3 వరకు కొనసాగిస్తూ ప్రధాని మోడీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అప్పటి వరకు […]

Update: 2020-04-14 05:07 GMT

రౌడీ పోలీసుల చర్యలను అభినందిస్తున్నారు. కరోనా మహమ్మారి పై పోరులో మనకు రక్షకులుగా మారిన పోలీసులే నిజమైన హీరోలు అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో విజయ్ దేవరకొండ హైదరాబాద్ లో గ్రౌండ్ లెవెల్ పోలీసులతో ఇంటరాక్ట్ అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ… వారిని బూస్ట్ చేసే ప్రయత్నం చేశారు.

లాక్ డౌన్ మే 3 వరకు కొనసాగిస్తూ ప్రధాని మోడీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అప్పటి వరకు అలసిపోకుండా పట్టుదలగా ఉండాలని కోరారు. మీ సేవలే మమ్మల్ని కరోనా నుంచి కాపాడుతున్నాయి అని… అలాంటి మీరు ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలని కోరారు. సీపీ అంజనీ కుమార్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు విజయ్.

ఇంతకు ముందు కూడా విజయ్ స్వయంగా పోలీసులను కలిసి వారి కృషికి ధన్యవాదాలు తెలపడమే కాదు… టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మీ వెనుక ఉందని తెలిపారు. మీరు కరోనా పై చేసే సమరంలో మా సహాయం ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజలంతా మీ సూచనలు పాటిస్తారని… తెలంగాణ కరోనా పై విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.


Tags: Vijay devarakonda, Telangana police, CoronaVirus Covid19

Tags:    

Similar News