మీరెవరు నన్ను విరాళాలు అడిగేందుకు? ఫేక్ న్యూస్ పై విజయ్ ఫైర్
విజయ్ దేవరకొండ… ఫేక్ న్యూస్ పై ఘాటుగా స్పందించాడు. ఫేక్ న్యూస్ రాస్తున్న వెబ్ సైట్ల మీద విరుచుకుపడ్డాడు. అదే సమయంలో మంచిని వ్యాప్తి చేస్తున్న మీడియాను అభినందించాడు. ఇండస్ట్రీ గురించి చెడు వార్తలు రాస్తున్న వెబ్ సైట్స్ కు సమాధానం చెప్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు రౌడీ హీరో. మా ఇండస్ట్రీ మీద ఆధారపడి బతికే మీరు మా గురించి చెత్త న్యూస్ రాయకుండా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ బతకండి అంటూ ఆగ్రహం వ్యక్తం […]
విజయ్ దేవరకొండ… ఫేక్ న్యూస్ పై ఘాటుగా స్పందించాడు. ఫేక్ న్యూస్ రాస్తున్న వెబ్ సైట్ల మీద విరుచుకుపడ్డాడు. అదే సమయంలో మంచిని వ్యాప్తి చేస్తున్న మీడియాను అభినందించాడు. ఇండస్ట్రీ గురించి చెడు వార్తలు రాస్తున్న వెబ్ సైట్స్ కు సమాధానం చెప్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు రౌడీ హీరో.
మా ఇండస్ట్రీ మీద ఆధారపడి బతికే మీరు మా గురించి చెత్త న్యూస్ రాయకుండా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ బతకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరెవరు అసలు మమ్మల్ని విరాళాలు ఇమ్మని అడిగేందుకని మండిపడ్డారు.మీ వెబ్ సైట్స్ కు మా సినిమా యాడ్ ఇస్తే ఒకలా న్యూస్ రాస్తారు… ఇవ్వకపోతే మరోలా న్యూస్ రాస్తారా.
రేటింగ్స్ గురించి బెదిరిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. తప్పుడు అభిప్రాయాలు చిల్లర న్యూస్ రాస్తూ చిల్లర సంపాదించేది మీరు అంటూ క్లాస్ పీకారు. నాకు నచ్చినప్పుడు నా మనసుకు నచ్చిన వాళ్లకు ఇంటర్వ్యూ ఇస్తానని స్పష్టం చేశాడు. అంతే కాని ఇలాంటి చెత్త న్యూస్ రాస్తున్నరని భయపడే ప్రసక్తే లేదన్నాడు.
విజయ్ విరాళం ఇవ్వడా..? ఎక్కడ పోయాడు.? బయటకి రారా అంటూ వార్తలు రాసిన మీరు..
విజయ్ దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అందించిన సహాయాన్ని అభినందించక పోగా… అసలు ఎందుకు స్టార్ట్ చేశాడు అని రాస్తున్నారు… మినిమం కామన్ సెన్స్ లేదా అని ప్రశ్నించాడు. ఫ్యాన్స్ నుంచి డబ్బులు కలెక్ట్ చేసి విజయ్ ఏం చేయాలి అనుకుంటున్నాడు? ఏం చేస్తున్నాడు?… మధ్యతరగతి ప్రజలను మాత్రమే సహాయం చేసుకోవడానికి ఎందుకు ఎంచుకోవాలి… ఫండ్స్ లేకపోతే కేవలం హైదరాబాద్ లోనే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలను ఎంచుకోవచ్చు కదా.. అంటూ ఇలాంటి చెత్త రాయొద్దు. ఇలాంటి పిచ్చి వార్తలు రాస్తే మీకు మీ సంస్థ పైసలు ఇస్తే మూడు పూటలా తిని కూర్చుంటారు కానీ ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉపాధి లేక డబ్బులు లేని వారు ఎలా బతుకుతారు ఆలోచించండి. మీకు దీనికి సమాధానం కావాలంటే మా మిడిల్ క్లాస్ ఫండ్ ద్వారా సాయం పొందిన వారిని అడిగి తెలుసుకోండి అంటూ లబ్ధి పొందిన వారి డిటైల్స్ ఇచ్చారు విజయ్.
నా లైఫ్ ను నాశనం చేసేందుకే కంకణం కట్టుకున్నారా అంటూ ఫైర్ అయ్యారు.. వీలైతే సహాయం చేయండి తప్పా… సహాయం చేసేందుకు ముందుకు వచ్చినవారి పై ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దని హెచ్చరించాడు.
Tags: Vijay Devarakonda, The Devarakonda Foundation, Middle Class Fund, Websites