కోలుకున్న సాయినార్ బాధితులు ఏమన్నారంటే…?

దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్ పారిశ్రామిక వాడ పరవాడలోని సాయినార్‌ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో చోటుచేసుకున్న ప్రమాదంలో క్షతగాత్రులైన ముగ్గురు ఉద్యోగులు గాజువాకలోని ఆర్కే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొలుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదంలో గాయపడిన వైనంపై హెల్పర్‌ పి.ఆనంద్‌బాబు, ట్రైనీ కెమిస్ట్‌ డి.జానకీరామ్‌, కెమిస్ట్‌ ఎం.సూర్యనారాయణ మాట్లాడుతూ, సోమవారం రాత్రి సుమారు తొమ్మిది మంది వరకు విధుల్లో ఉన్నాము. సరిగ్గా రాత్రి 11:30 గంటల సమయంలో రియాక్టర్‌ నుంచి బెంజిమిడాజోల్‌ గ్యాస్‌ లీకైంది. ఈ […]

Update: 2020-07-02 01:51 GMT

దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్ పారిశ్రామిక వాడ పరవాడలోని సాయినార్‌ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో చోటుచేసుకున్న ప్రమాదంలో క్షతగాత్రులైన ముగ్గురు ఉద్యోగులు గాజువాకలోని ఆర్కే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొలుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదంలో గాయపడిన వైనంపై హెల్పర్‌ పి.ఆనంద్‌బాబు, ట్రైనీ కెమిస్ట్‌ డి.జానకీరామ్‌, కెమిస్ట్‌ ఎం.సూర్యనారాయణ మాట్లాడుతూ, సోమవారం రాత్రి సుమారు తొమ్మిది మంది వరకు విధుల్లో ఉన్నాము. సరిగ్గా రాత్రి 11:30 గంటల సమయంలో రియాక్టర్‌ నుంచి బెంజిమిడాజోల్‌ గ్యాస్‌ లీకైంది. ఈ విషయాన్ని గుర్తించిన కెమిస్టు జానకీరామ్‌ సమాచారాన్ని షిఫ్ట్‌ ఇన్‌చార్జ్‌కు తెలిపారు. దీంతో సమీపంలో ఉన్న తామంతా రియాక్టర్‌ దగ్గరికెళ్లాం. అంతవరకే గుర్తుంది. ఆ తరువాత ఏం జరిగిందో గుర్తులేదని అన్నారు. ఆస్పత్రిలో చికిత్సతో కోలుకున్న తరువాతే ప్రమాద తీవ్రత తెలిసిందని వారు చెప్పారు. అప్పుడు భయమేసిందని అన్నారు. దేవుడి దయవలన ప్రాణాలతో బయటపడ్డామని పేర్కొన్న ఆ ముగ్గురూ, తమకు ఇది పునర్జన్మని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News