భూతవైద్యుడికి దేహశుద్ధి

దిశ ప్రతినిధి, నిజామాబాద్: భూతవైద్యుడని నమ్మివచ్చిన ఆమాయకులను ఓ దొంగబాబా వంచించాడు. చేతబడి, అమావాస్య-పౌర్ణమి పూజలు చేస్తానని మహిళలను నమ్మించి, వారిపై ఆఘాయిత్యాలకు పాల్పడ్డారు. అసలు విషయం తెలిసిన బాధితులు ముకుమ్మడిగా మంగళవారం దొంగబాబాకు దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతన్ని పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని పూసలగల్లి( జవహర్ రోడ్)లోని లక్ష్మిరాజం కాంప్లెక్స్‌లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… కాంప్లెక్స్‌లో ప్రసాద్ అనే భూతవైధ్యుడు ఉన్నారు. అతను […]

Update: 2020-10-13 02:37 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: భూతవైద్యుడని నమ్మివచ్చిన ఆమాయకులను ఓ దొంగబాబా వంచించాడు. చేతబడి, అమావాస్య-పౌర్ణమి పూజలు చేస్తానని మహిళలను నమ్మించి, వారిపై ఆఘాయిత్యాలకు పాల్పడ్డారు. అసలు విషయం తెలిసిన బాధితులు ముకుమ్మడిగా మంగళవారం దొంగబాబాకు దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతన్ని పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని పూసలగల్లి( జవహర్ రోడ్)లోని లక్ష్మిరాజం కాంప్లెక్స్‌లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే…

కాంప్లెక్స్‌లో ప్రసాద్ అనే భూతవైధ్యుడు ఉన్నారు. అతను తనకు తానుగా బాబాగా చెప్పుకుంటూ… దీర్ఘకాలీక వ్యాధులకు వైద్యుడిగా, భూతవైద్యం చేస్తూ ప్రజలను నమ్మిస్తున్నాడు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ప్రాంతానికి చెందిన ఓ ఏళ్ల బాలికకు ఆరోగ్యం బాగాలేక ఆమె తల్లిదండ్రులు ప్రసాద్‌ను సంప్రదించారు. అయితే బాలికకు నయం కావడానికి మూడునెలలు పడుతుందని, అప్పటివరకూ వైద్యం చేసుకోవాలని నమ్మించాడు. బాలికకు వైద్యం పేరిట నిద్రమత్తు ట్యాబ్లెట్‌లను ఇచ్చి బలవంతం చేసేవాడు.

ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇటీవల బాలికకు కడుపు నోప్పి రావడంతో ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రిలో చూపించారు. దీంతో బాలిక గర్భం దాల్చినట్టు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రులు సదరు బాలికను ప్రశ్నించగా దొంగబాబా అఘాయిత్యం బహిర్గతం అయింది. ఇలానే మరో ఇద్ధరు మహిళలపై ప్రసాద్ ఆఘాయిత్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రసాద్ ఓ లోకల్ పత్రిక ఎడిటర్‌గా కూడా చెలామణి అవుతుండటంతో కొందరు మహిళా సంఘాల సాయంతో మంగళవారం ప్రసాద్‌ను బాధిత కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. చితక బాదారు. విషయం తెలిసిన స్థానిక వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పీఎస్‌కు తరలించారు.

Tags:    

Similar News