పవన్ కళ్యాణ్‌కు పీసీసీ ఇప్పిస్తా : వీహెచ్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం సీనియర్ నాయకులు వీహెచ్ వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది. రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఇస్తే తాను పార్టీలో కొనసాగలేనని ఇటీవల వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం గుంటూరు జిల్లా దొండపాడులో వంగవీటి రంగా విగ్రహాన్ని వీహెచ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీసీలకు పీసీసీ చీఫ్ ఇవ్వాలన్నందుకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం సీనియర్ నాయకులు వీహెచ్ వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది. రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఇస్తే తాను పార్టీలో కొనసాగలేనని ఇటీవల వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం గుంటూరు జిల్లా దొండపాడులో వంగవీటి రంగా విగ్రహాన్ని వీహెచ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీసీలకు పీసీసీ చీఫ్ ఇవ్వాలన్నందుకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తాను బెదిరింపులకు భయపడనని స్పష్టం చేశారు. అంతేగాకుండా నాడు వంగవీటి రంగా సీఎం అవుతాడనే హత్య చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో 3 శాతం ఉన్న సామాజికవర్గం వారు కాంగ్రెస్‌ను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం ప్రాణం పోయినా వెనక్కి తగ్గనని అన్నారు. అంతేగాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీలో చేరితే పీసీసీ చీఫ్ పదవి ఇప్పిస్తానని ప్రకటించారు. దీంతో మరోసారి వీహెచ్ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఏపీలో 27 శాతం ఉన్న కాపులు రాజ్యాధికారం సాధించాలని ఆకాంక్షించారు. వంగవీటి రంగా తర్వాత పవన్‌కల్యాణ్‌కు మంచి వేవ్ ఉందని హనుమంతరావు తెలిపారు.