దిశ కథనానికి స్పందన.. మండలంలో పర్యటించిన పశు వైద్యాధికారి.
దిశ, కరకగూడెం: మండలంలో పూర్తి స్థాయి పశు వైద్యాధికారి బదిలీపై వెళ్లడంతో పశు వైద్యం సకాలంలో అందడం లేదని ‘దిశ’ దినపత్రికలో శనివారం ప్రచురితమైంది. ‘అటెండరే పశువైద్యుడు’ అనే కథనానికి మంచి స్పందన లభించింది. పినపాక పశువైద్యాధికారి, కరకగూడెం పశు వైద్యశాల ఇంచార్జి బాలకృష్ణ చవాన్ మండలంలో పర్యటించి తాటిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో కొనసాగుతున్న టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ పశువులకు విధిగా గాలికుంటు వ్యాధి […]
దిశ, కరకగూడెం: మండలంలో పూర్తి స్థాయి పశు వైద్యాధికారి బదిలీపై వెళ్లడంతో పశు వైద్యం సకాలంలో అందడం లేదని ‘దిశ’ దినపత్రికలో శనివారం ప్రచురితమైంది. ‘అటెండరే పశువైద్యుడు’ అనే కథనానికి మంచి స్పందన లభించింది. పినపాక పశువైద్యాధికారి, కరకగూడెం పశు వైద్యశాల ఇంచార్జి బాలకృష్ణ చవాన్ మండలంలో పర్యటించి తాటిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో కొనసాగుతున్న టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ పశువులకు విధిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి అని కోరారు.
అలాగే టీకాలు వేసిన ప్రతి పశువుకు చెవిపోగు వేసి ఆన్లైన్ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు తమ ఆధార్ కార్డును పశువుల చెవిపోగు నెంబర్ కు అనుసంధానం చేసి ఆన్లైన్ చేయడం జరుగుతుందని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పినపాక, కరకగూడెం మండల పశు వైద్య సిబ్బంది శ్రీనివాసరావు శేఖర్, వెంకటరమణ , అరుణ, గోపాల మిత్రులు రామ కృష్ణ, గోపాల కృష్ణ, సుమన్, పశుమిత్రలు నిర్మల, త్రిమూర్తులు, చలపతిరావు పాల్గొన్నారు.