అదనంగా ఇచ్చుంటే ఆర్థిక మంత్రి ప్రకటించాలి
దిశ, ఆదిలాబాద్: ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలచారి విమర్శించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విపత్కర పరిస్థితుల్లో బీజేపీ రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. కోవిడ్ నివారణకు రూ.ఏడు వేల కోట్లు కేంద్రం ఇచ్చినట్టు బీజేపీ నేతలు మాట్లాడటం విడ్డూరమన్నారు. ఇప్పటివరకు కేంద్రం కేవలం వెయ్యి కోట్లు మాత్రమే మంజూరు చేసిందని స్పష్టం చేశారు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారమే రాష్ట్రంలో […]
దిశ, ఆదిలాబాద్: ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలచారి విమర్శించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విపత్కర పరిస్థితుల్లో బీజేపీ రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. కోవిడ్ నివారణకు రూ.ఏడు వేల కోట్లు కేంద్రం ఇచ్చినట్టు బీజేపీ నేతలు మాట్లాడటం విడ్డూరమన్నారు. ఇప్పటివరకు కేంద్రం కేవలం వెయ్యి కోట్లు మాత్రమే మంజూరు చేసిందని స్పష్టం చేశారు.
ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారమే రాష్ట్రంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ కేంద్రం తెలంగాణకు అదనంగా కరోనా నిధులు ఇచ్చి ఉంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతల తీరు ఫెడరల్ వ్యవస్థకు భంగం కలిగించేలా ఉన్నాయని వేణుగోపాలచారి అన్నారు.