చక్రం తిప్పనున్న కొప్పుల.. వెల్గటూర్ అధ్యక్ష పీఠం ఎవరిది..?
దిశ, వెల్గటూర్ : పది మందిని ఒప్పించి పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళే సత్తా కలిగిన నాయకుడిని ఎంపిక చేయడం అంతా ఆషామాషీ విషయం కాదు. అందులో అధికార పార్టీ కావడం, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను వదలి టీఆర్ఎస్‌లో చేరిన వారి సంఖ్య కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంది. నామినేటెడ్ పదవుల్లో అవకాశం దక్కలేదని అలిగి ఆశావహులు మరో పార్టీ వైపు దృష్టి మళ్ళించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మండలంలో గల టీఆర్ఎస్ నాయకులు రెండు వర్గాలుగా […]
దిశ, వెల్గటూర్ : పది మందిని ఒప్పించి పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళే సత్తా కలిగిన నాయకుడిని ఎంపిక చేయడం అంతా ఆషామాషీ విషయం కాదు. అందులో అధికార పార్టీ కావడం, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను వదలి టీఆర్ఎస్‌లో చేరిన వారి సంఖ్య కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంది. నామినేటెడ్ పదవుల్లో అవకాశం దక్కలేదని అలిగి ఆశావహులు మరో పార్టీ వైపు దృష్టి మళ్ళించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మండలంలో గల టీఆర్ఎస్ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మండల అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే చర్చ పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది.
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్ మండలంలో టీఆర్ఎస్ గ్రామకమిటీల నియామకం పూర్తయింది. ఈనెల 20 వరకు మండల అధ్యక్ష పదవి నియామకాన్ని చేపట్టాలని అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ పరిశీలకులతో పాటు మంత్రి కొప్పుల ఈశ్వర్ క్షేత్ర స్థాయి కమిటీలపై దృష్టి సారించారు. అంతర్గత విభేదాలతో దూరం దూరంగా ఉంటున్న నాయకులందరినీ సమన్వయపరుస్తూ మండలంలో పార్టీని బలోపేతం చేసే వ్యక్తిని నియమించేందుకు అంతర్గత మదనం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తెరపై గల వ్యక్తులను నియమిస్తారా? లేక కొత్త వారికి అవకాశం కల్పిస్తారా..? అనే చర్చ మండలంలో జరుగుతోంది. అవతలి పార్టీ నాయకుల ఎత్తుగడలను అంచనా వేస్తూ.. స్థానిక అంశాలపై పట్టు ఉండి, క్యాడర్‌లో జోష్ నింపే సమర్థవంతమైన నాయకుడు ఎవరున్నారని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు పోతే పార్టీని పటిష్ట పరిచి సత్తా చాటేవాడు మండల అధ్యక్షుడిగా రావాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నారు.
ఆశావహుల రాజకీయ నేపథ్యం :
2) డీఎంపీ : పొడేటి రవి – స్తంభంపల్లి
*2010లో కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి ఆయన వెన్నంటే ఉంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వహించిన అన్ని కార్యక్రమాలు రైలు రోకో, వంటావార్పు, సకల జనుల సమ్మెలో పాల్గొన్నాడు.
*కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవి రావాలని కరీంనగర్‌లో ధర్నాచేసి అరెస్టు అయ్యాడు.
*వెల్గటూర్ మండలంలో స్థంభంపల్లి కలవక ముందు ధర్మపురి మండల టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పనిచేసాడు.
*2006 నుంచి వెల్గటూర్ మండల గౌడ సంఘం అధ్యక్షులుగా పని చేస్తున్నాడు.
* మొదటినుంచి వీరి కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగి ఉంది.
*తండ్రి బుచ్చయ్య, భార్య లక్ష్మి సర్పంచ్‌గా, చిన్నబాపు మల్లయ్య ఎంపీటీసీగా మూడు పర్యాయాలు చేశారు.
ప్రస్తుతం రవి తమ్ముడు సతీష్ ఎంపీటీసీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
3) డీఎంపీ : చల్లూరి రాంచందర్ గౌడ్ – స్తంభంపల్లి
* 2013 నుంచి 2018 వరకు స్థంభంపల్లి ఎంపీటీసీగా బాధ్యతలు నిర్వహించాడు.
*స్థంభంపల్లిలో గల శ్రీ వెంకటే శ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌గా పని చేశాడు.
*2018లో కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడిగా పని చేశాడు.
*2018 నుంచి 2021 వరకు టీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాడు.
*రాంచెందర్ భార్య రూపా రాణి ప్రస్తుతం స్థంభంపల్లి గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తుంది.
4) డీఎంపీ : జూపాక కుమార్ – వెల్గటూర్
*2004 నుండి ఇప్పటివరకు వెల్గటూర్ మండల ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు.
*2006 నుంచి 2011 వరకు వెల్గటూర్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా పని చేశాడు.
*2005 నుంచి 2008 వరకు తెలుగుదేశం పార్టీ యువజన అధ్యక్షుడిగా 2008 నుండి 2015 వరకు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడిగా పనిచేశాడు.
*2013లో వెల్గటూర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్‌గా పోటీచేసి ఓడిపోయాడు.
*2014 నుంచి 2021 వరకు వెల్గటూర్ మోడల్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్‌గా పని చేశాడు.
*2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్‌లో చేరి పార్టీ సూచించే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు.
5) డీఎంపీ : సింహాచలం జగన్ – గుల్లకోట
* 2001 నుంచి 2011 వరకు రెండు పర్యాయాలు వార్డు సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలు నిర్వహించాడు.
*2004 నుంచి 2012 వరకు భావన యూత్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేసాడు.
*2013 నుంచి 18 వరకు గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించాడు.
*2012 నుంచి 2016 వరకు ఆర్ఎంపీ అసోసియేషన్ మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.
*2010 నుంచి 2015 వరకు టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.
*2015లో టీఆర్ఎస్ పార్టీలో చేరాడు.
*2019 నుంచి 2021 వరకు టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శగా పనిచేశాడు.
*జగిత్యాల జిల్లా శ్రీ వైష్ణవ సంగం గౌరవ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
* వెల్గటూర్ మండల అధ్యక్షులుగా పనిచేసిన వారు వీరే..
* 2001 నుంచి 2008 వరకు తంగళ్ళపల్లి చక్రపాణి ( గొడిశెలపేట)
* 2008 నుంచి 2010 వరకు ఏలేటి చంద్రారెడ్డి ( రాజారాంపల్లి )
* 2011 నుంచి2014 వరకు తంగళ్ళపల్లి చక్రపాణి (గొడిశెలపేట )
* 2014 నుంచి 2016 వరకు పత్తిపాక వెంకటేష్ (రాజక్కపల్లి )
* 2016 నుంచి 2018 వరకు మూగల సత్యం (మొక్కట్రావుపేట )
*2019 నుంచి 2021 వరకు చల్లూరి రామచందర్ గౌడ్ (స్థంభంపల్లి)