పోలీసు శాఖ ఆధ్వర్యంలో 700కుటుంబాలకు కూరగాయలు పంపిణీ
దిశ, ఆదిలాబాద్ : కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పోలీసు అధికారులు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. అయితే మంగళవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో 700 కుటుంబాలకు కూరగాయాలను డీఎస్పీ సత్యనారాయణ పంపిణీ చేశారు. కరోనా లక్షణాలపై ఆరా తీసేందుకు చేపట్టిన ఇంటింటి సర్వే ముమ్మరంగా కొనసాగింది. జైనూర్ మండలంలోని పాట్నాపూర్, భూసిమెట్ట , జంగాం చెక్ పోస్టు వద్ద అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజలెవరూ బయటకు రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.కార్యక్రమంలో డిప్యూటీ […]
దిశ, ఆదిలాబాద్ :
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పోలీసు అధికారులు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. అయితే మంగళవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో 700 కుటుంబాలకు కూరగాయాలను డీఎస్పీ సత్యనారాయణ పంపిణీ చేశారు. కరోనా లక్షణాలపై ఆరా తీసేందుకు చేపట్టిన ఇంటింటి సర్వే ముమ్మరంగా కొనసాగింది. జైనూర్ మండలంలోని పాట్నాపూర్, భూసిమెట్ట , జంగాం చెక్ పోస్టు వద్ద అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజలెవరూ బయటకు రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్ నాయక్ , జైనూర్, వాంకిడి సీఐలు జవ్వాజి సురేష్ , రాణా ప్రతాప్ , జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్ రావ్, సహకార సంఘం చైర్మన్ కొడప హన్నుపటేల్, ఎస్ఏలు తిరుపతి , విష్ణువర్ధన్ , వెంకటేష్ , రమేష్ , వైద్యాధికారి సిడాం నాగేంద్ర , సర్పంచ్ పార్వతి లక్ష్మణ్, ఎంపీటీసీఅజ్జులాల తదితరులు ఉన్నారు.
Tags: corona, lockdown, police department, 700 family, vegetables supply