మహిళను చితకబాదిన పోలీసులు..

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని చిత్తూరు జిల్లా వాయలప్పాడులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తనకు న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్ గడప తొక్కిన వివాహితను పోలీసులు చితకబాదారు.ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకివెళితే.. గతనెల 20న బాధిత మహిళ భర్త రవి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈయన గొర్రెలు కాస్తూ జీవనం సాగించేవాడు. అయితే, తన భర్తను హత్యచేశారని.. న్యాయం చేయాలని బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. స్పందించిన పోలీసులు నిందితుడు ధనశేఖర్ రెడ్డితో రాజీ చేసుకోవాలిన […]

Update: 2020-09-03 22:12 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

ఏపీలోని చిత్తూరు జిల్లా వాయలప్పాడులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తనకు న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్ గడప తొక్కిన వివాహితను పోలీసులు చితకబాదారు.ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకివెళితే.. గతనెల 20న బాధిత మహిళ భర్త రవి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈయన గొర్రెలు కాస్తూ జీవనం సాగించేవాడు. అయితే, తన భర్తను హత్యచేశారని.. న్యాయం చేయాలని బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. స్పందించిన పోలీసులు నిందితుడు ధనశేఖర్ రెడ్డితో రాజీ చేసుకోవాలిన ఆ మహిళపై ఒత్తిడి తెచ్చారు. అయినా ఆమె వినిపించుకోలేదు. ఈ క్రమంలోనే స్టేషన్‌కు వచ్చిన ఆమెను పోలీసులు చితకబాదారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజాసంఘాల నాయకులు వాయల్పాడు పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు.

Tags:    

Similar News