వైరల్ అవుతున్న వావిలాల మండలం మ్యాప్

దిశ, జమ్మికుంట: జమ్మికుంట మండలంలోని వావిలాల గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడంతో అందుకు సంబంధించి వావిలాల మండల మ్యాప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జమ్మికుంట మండలంలోని తనుగుల, వావిలాల, ఇల్లందకుంట మండలంలోని రాచపల్లి, వంతడుపుల రెవిన్యూ గ్రామాలతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ఎంపేడు, వెల్లంపల్లి, దుబ్యాల రెవెన్యూ గ్రామాలను కలుపుతూ వావిలాల నూతల మండలంగా ఏర్పాటు అవుతుందంటూ సోషల్ మీడియాలో మ్యాప్ వైరల్ అవుతోంది. వావిలాల […]

Update: 2021-07-12 07:42 GMT

దిశ, జమ్మికుంట: జమ్మికుంట మండలంలోని వావిలాల గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడంతో అందుకు సంబంధించి వావిలాల మండల మ్యాప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జమ్మికుంట మండలంలోని తనుగుల, వావిలాల, ఇల్లందకుంట మండలంలోని రాచపల్లి, వంతడుపుల రెవిన్యూ గ్రామాలతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ఎంపేడు, వెల్లంపల్లి, దుబ్యాల రెవెన్యూ గ్రామాలను కలుపుతూ వావిలాల నూతల మండలంగా ఏర్పాటు అవుతుందంటూ సోషల్ మీడియాలో మ్యాప్ వైరల్ అవుతోంది.

వావిలాల గ్రామ ఎంపీటీసీ సభ్యుడు మరి మల్లేశం గత నెలలో వావిలాలను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినతిపత్రం అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నూతన మండల ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను మూడు రోజుల క్రితం ఆదేశించారు. ఈ మేరకు మండలం ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతుండడంతో.. పరిసర గ్రామాల ప్రజలు మ్యాప్ చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. తమ గ్రామాలను వావిలాలలో కలప వద్దంటూ ఇప్పటికే వెల్లంపల్లి, దుబ్యాల, ఎంపేడు గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వావిలాల మండల ఏర్పాటు ఏ మేరకు కొనసాగుతుందో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News