క్రికెట్‌కు వసీం జాఫర్ గుడ్ బై..

రంజీ లెజెండరీ ఆటగాడు మాజీ ఓపెనర్, డాషింగ్ బ్యాట్స్‌మెన్ వసీం జాఫర్ అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.అన్నిఫార్మట్ల నుంచి తప్పుకుంటున్నట్టు శనివారం ప్రకటించారు.ఇన్నిరోజులు తనకు సహాయ సహకారాలు అందించిన కోచ్, సెలక్టర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.జాఫర్ 1996-97లో క్రికెట్‌‌లోకి ఆరంగేట్రం చేసిన జాఫర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 260మ్యాచ్‌లు ఆడి 57 సెంచరీలు,91 హాఫ్ సెంచరీల సాయంతో 19,410పరుగులు చేశాడు. భారత్ తరఫున 31టెస్టులు,2వన్డేలు ఆడగా, ఇటు రంజీల్లో 150 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా […]

Update: 2020-03-07 20:59 GMT

రంజీ లెజెండరీ ఆటగాడు మాజీ ఓపెనర్, డాషింగ్ బ్యాట్స్‌మెన్ వసీం జాఫర్ అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.అన్నిఫార్మట్ల నుంచి తప్పుకుంటున్నట్టు శనివారం ప్రకటించారు.ఇన్నిరోజులు తనకు సహాయ సహకారాలు అందించిన కోచ్, సెలక్టర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.జాఫర్ 1996-97లో క్రికెట్‌‌లోకి ఆరంగేట్రం చేసిన జాఫర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 260మ్యాచ్‌లు ఆడి 57 సెంచరీలు,91 హాఫ్ సెంచరీల సాయంతో 19,410పరుగులు చేశాడు. భారత్ తరఫున 31టెస్టులు,2వన్డేలు ఆడగా, ఇటు రంజీల్లో 150 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. రంజీల్లో మొత్తంగా 12,038రన్స్ చేసి చరిత్ర కెక్కాడు.

Tags:    

Similar News