నెటిజన్ నోరు మూయించిన వరుణ్ ధావన్
దిశ, సినిమా : బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌కు ఈ మధ్య సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. తన వైఫ్‌తో కలిసి ఉన్న ఓ పిక్‌ను ఇన్‌స్టాలో పోస్టు చేయడమే అందుకు కారణమైంది. కరోనా సెకండ్ వేవ్ కట్టడికి దేశమంతా పోరాడుతున్న సమయంలో ధావన్ ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు విషయానికొస్తే.. వరుణ్, తన వైఫ్ నటాషా దలాల్ అరుణాచల్ ప్రదేశ్‌లోని జిరోలో భేడియా షూటింగ్ ముగించుకొని బుధవారం తిరిగొచ్చారు. ఈ క్రమంలో […]
దిశ, సినిమా : బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌కు ఈ మధ్య సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. తన వైఫ్‌తో కలిసి ఉన్న ఓ పిక్‌ను ఇన్‌స్టాలో పోస్టు చేయడమే అందుకు కారణమైంది. కరోనా సెకండ్ వేవ్ కట్టడికి దేశమంతా పోరాడుతున్న సమయంలో ధావన్ ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు విషయానికొస్తే.. వరుణ్, తన వైఫ్ నటాషా దలాల్ అరుణాచల్ ప్రదేశ్‌లోని జిరోలో భేడియా షూటింగ్ ముగించుకొని బుధవారం తిరిగొచ్చారు. ఈ క్రమంలో ముంబయి ఎయిర్‌పోర్టులో తన స్టిల్స్ కోసం ఎదురుపడ్డ ఫొటోగ్రాఫర్లను సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించాడు. అయితే ఈ వీడియోపై ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ కామెంట్ చేశాడు.
‘ఓ వైపు దేశమంతా ప్రమాదకర పరిస్థితులు ఉంటే మీరు వెకేషన్‌కు వెళ్లి, ఫొటోలకు ఫోజులిస్తారు. తిరిగొచ్చి అదే విషయంలో కంప్లయింట్ చేస్తారు. మీ అధికారాన్ని ప్రదర్శించడం ఆపితే బాగుంటుంది’ అని చురకలంటించాడు. కాగా యూజర్ కామెంట్‌పై స్పందించిన వరుణ్..‘మీకు నచ్చినట్టు ఊహించుకోకండి. నేను వెళ్లింది షూటింగ్‌కే గానీ హాలీడే వెకేషన్‌కు కాదు. నాకు కూడా పరిస్థితి ఎలా ఉందో తెలుసు. కొవిడ్ వల్ల నేను కూడా ఆప్తులను కోల్పోయాను. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మీ దగ్గరే ఉంచుకోండి’ అని రిప్లయ్ ఇచ్చాడు. ఇంతకుముందు తన బర్త్‌డే సెలబ్రేషన్స్ సందర్భంగా కామన్ డీపీ పోస్టు చేయడంపై కూడా వరుణ్ ట్రోల్స్ ఎదుర్కొన్నాడు.