దిశ, ఫీచర్స్: సీజన్‌తో సంబంధం లేకుండా.. ఎప్పుడూ స్టైల్‌గా ఉండాలని చాలామంది అమ్మాయిలు అనుకుంటారు. ఎంత చలి ఉన్నా స్టైల్‌గా ఉండడంలో తగ్గేదేలే అంటుంటారు మరికొందరు అమ్మాయిలు. దీనికోసం చాలామంది బిగుతుగా ఉన్న దుస్తులను ధరిస్తుంటారు. టైట్‌గా ఉన్న దుస్తులు ధరించడం వల్ల శరీరంలో రక్తప్రసరణ ప్రక్రియ దెబ్బతిని, శరీరాన్ని మరింత చల్లగా మారుస్తుంది. కాబట్టి మందంగా ఉన్న దుస్తులు వాడడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అయితే, స్టైల్‌గా రెడీ అవ్వాలంటే ఫ్యాషన్‌పై కొంత అవగాహన కూడా ఉండాలి. చలికాలంలో వేసుకునే కొన్ని రకాల బట్టలు చాలామందికి అసౌకర్యంగా అనిపిస్తాయి. అందుకే కొన్ని ప్రత్యేకమైన దుస్తులు ఈ సీజన్‌లో ధరించాలి. ఈ దుస్తులు వెచ్చగా ఉండడమే కాకుండా స్టైల్‌గా కూడా కనిపిస్తాయి.
* ప్రతి అమ్మాయి దగ్గర కూడా ఉన్నితో కవర్ చేసిన థర్మల్ షర్టులు ఉండాలి. ఇవి చూడడానికి ఫ్యాషన్‌గా కనిపించడంతో పాటుగా వెచ్చదనాన్ని అందిస్తాయి. వీటిల్లో రకరకాల డిజైన్లు, రంగులు కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. వీటికి జోడిగా పొడవాటి బూట్లు ధరిస్తే లుక్ అదిరిపోతుంది. వీటిని ఏ దుస్తులతో అయినా వేసుకోవచ్చు. ఇవి చూడడానికి హైక్లాస్ లుక్‌ని ఇస్తాయి.
* వింటర్ సీజన్‌లో ఫుల్ స్లీవ్ జాకెట్ అనేది మరో గొప్ప ఎంపిక. ఇది ఫ్యాషన్‌తో పాటుగా కంఫర్ట్‌గా కూడా ఉంటాయి. ఈ ఫుల్ స్లీవ్ జాకెట్ వేసుకున్నప్పుడు వెచ్చని స్టోల్ లేదా స్కార్ఫ్ ధరించండి. ఈ దుస్తులు మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడంతోపాటుగా స్టైల్‌గా కూడా కనిపిస్తారు. ఇవి ఆఫీస్, నైట్ పార్టీలను బాగుంటాయి.
* ఇలాంటి దుస్తులు కాకుండా నార్మల్ లుక్‌లో కనిపించాలంటే జీన్స్, లాంగ్ జాకెట్ ధరించడం మంచిది. జీన్స్‌తో పాటుగా దానికి తగిన లాంగ్ జాకెట్ వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. ఇలాంటి నార్మల్ దుస్తులతో కూడా మీరు వింటర్‌లో స్టైల్‌గా అందంగా కనిపించవచ్చు.
* ఫుల్ గ్లోవ్స్ అనేవి మణికట్టు వరకు ఉంటాయి. టీ షర్ట్స్ లేదా టాప్స్ వేసుకున్నప్పుడు ఇది వేసుకుంటే కొత్త లుక్ వస్తుంది. వీటిని డ్రస్, జాకెట్ లేదా షూ కలర్‌ని బట్టి వీటి రంగులను ఎంచుకోవచ్చు.