Ear wax problems: చెవిలో గులిమి తొలగిస్తున్నారా? అది వేస్టేజా? ఉపయోగకరమో తెలుసుకోండి?

సాధారణంగా చెవిలో గులిమి ఏర్పడుతుంది.

Update: 2024-11-26 08:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా చెవిలో గులిమి(Gulimi) ఏర్పడుతుంది. కొందరిలో ఈ గులిమి ఎక్కువగా మారి తెగ ఇబ్బంది పెడుతుంటుంది. దీంతో వైద్యుడ్ని(doctor) సంప్రదించి.. ఆ గులిమిని తొలగించుకుంటారు. మరికొంతమంది చెవుల్లో అగ్గిపుల్లలు(Aggipullalu), పుల్లలు వంటివి పెట్టీ తీస్తుంటారు. కానీ పుల్లలు చెవి(ear)లో పెట్టకూడదంటున్నారు నిపుణులు. మరీ ఎక్కువగా ఇబ్బందిగా అనిపిస్తే ఆసుపత్రికి వెళ్లడం బెటర్. అయితే చెవిలో గులిమి ఎలా ఏర్పడుతుంది? గులిమి అంటే ఏంటి? చెవిలో ఉత్పత్తి అయ్యే పదార్థమా? లేక ఏంటని చాలా మందిలో ఈ ప్రశ్నలు తలెత్తే ఉంటాయి. మరీ ఈ గులిమి అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా అయితే చాలా మంది గులిమిని ఒక వేస్ట్ పదార్థంగా చూస్తారు అది చెవి లోపలి గ్రంధుల్లో తయారు అవుతుంది. అయితే గులిమి కూడా కొన్ని విధులు నిర్వహిస్తుంది. చెవులను క్లీన్ గా ఉంచుతుంది.చెవిలో ఉండే చిన్న రక్తనాళాలు(Small blood vessels) ఎండిపోకుండా ఉంచడంలో, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. అంతేకాకుండా బయటి నుంచి వచ్చే ధూళికణాలు(Dust particles) చెవిలోపలికి పోకుండా అడ్డుకుంటుంది.

గులిమి చెవిలోపలికి వాటర్(Water) వెళ్లకుండా కాపాడుతుంది. గులిమిలో యాంటీ బ్యాక్టీరియల్(Anti bacterial), యాంటీ ఫంగల్(Antifungal) లక్షణాలు ఉంటాయి. ఇవి చెవిని ఆరోగ్యంగా ఉంచుతాయి. చెవిలోన గులిమి వాస్తవానికి ఉపయోగకరమైనదని చెప్పవచ్చు. చెవిలో ఎలాంటి రోగాలు రాకుండా కూడా కాపాడుతుంది.

అయితే గులిమి అప్పుడప్పుడు ఎండిపోతుంది. దీంతో కొంతమంది చెవిలో పుల్లలు పెట్టి.. బయటకు తీసేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఇలా చేస్తే సమస్య మరింత తీవ్రమవుతుందని. చెవిలో నొప్పి వస్తుంది. వినికిడి సమ్యలు ఏర్పడతాయి. కాగా గులిమి అంతగా ఇబ్బంది పెట్టినట్లైతే.. వైద్య పద్ధతులు ఉంటాయి.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులను సంప్రదించగలరు.

Tags:    

Similar News