అభద్రతా భావం.. ఇలా అధిగమించండి!
కొందమందిలో సమర్థత ఉన్నా తమను తాము తక్కువ చేసుకుంటూ ఆందోళన చెందుతుంటారు.
దిశ, ఫీచర్స్: కొంతమందిలో సమర్థత ఉన్నా తమను తాము తక్కువ చేసుకుంటూ ఆందోళన చెందుతుంటారు. అనేక కారణాలతో సతమతమై మానసిక వేదన అనుభవిస్తుంటారు. వీరికి ప్రతి రోజూ ఎదురయ్యే సంఘటనలు, ఒత్తిడిని కలిగిస్తాయి. కొంతమందిలో అభద్రతా భావంలోనై ఇతరుల నమ్మకాన్ని దూరం చేసుకుంటారు. అయితే, ప్రతీ ఒక్కరూ ఎదో ఒక ప్రత్యేకమైన నైపుణ్యంను కలిగి ఉంటారు. అందులో కొందరు మాత్రమే దానిని గుర్తించి సరైన రీతిలో వినియోగించుకుంటారు. అయితే, అభద్రతా భావం ఉన్న వారిలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. వారికి నైపుణ్యం ఉన్నా తమను తాము తక్కువ అంచనా వేసుకుంటారని నిపుణులు చెబుతున్నారు.
ఆత్మవిశ్వాసం అనేది మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. కానీ, అభద్రతా భావం ఉన్న వారు మాత్రం వారు చేసిన పని సరైనదే అయినా ఇతరుల అభిప్రాయంను కోరుతుంటారు. వాళ్లపై వాళ్లకి నమ్మకం ఉండదు. ఇతరులు చెప్పే సమాధానం కోసం ఆరాటపడుతుంటారు. వారి నుంచి సానుకూల స్పందన వస్తే సంతృప్తి చెందడం లేదంటే బాధపడడం వంటివి చేస్తారు. ఇలాంటి వారు స్వీయ నమ్మకంను పెంపొందించుకోవాలి.
అభద్రతా భావం ఉన్న వారు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి బదులుగా వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. వీటికి ఇతరులను బాధ్యులుగా చేసి, వారిని నిందించడమే పనిగా పెట్టుకుంటారు. అయితే, ఇటువంటి విషయాల్లో అప్పటికి సంతృప్తిగా ఉన్నా.. భవిష్యత్‌లో వీళ్లు అనేక సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది.
వీళ్లు ఎప్పుడూ కూడా ఇతరులతో పోల్చుకుంటుంటారు. వాళ్లు సాధించిన విజయాలనే తాము సాధించాలని అనుకుంటారు. ఒకవేళ విజయం సాధించకపోతే ఎక్కువగా కుంగిపోతుంటారు. వాళ్లనను నిందించడం లేదా వారిపై అసూయపడడం వంటివి చేస్తారు.
అభద్రాతా భావం ఉన్న వాళ్లు ఎక్కువగా వారి భవిష్యత్ గురించి ఆలోచిస్తుంటారు. ప్రతీ చిన్న విషయాన్ని కూడా అతిగా ఆలోచిస్తూ ఒత్తిడికి లోనవుతారు. ఇది మానసిక సమస్యలకు కారణం కావొచ్చు. ప్రతి విషయాన్ని నెగిటివ్‌గా కాకుండా పాజిటివ్‌గా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. ఒక సమస్య ఎదురైనప్పుడు దానిని సానుకూలంగా ఎలా పరిష్కరించాలో ఆలోచించాలి. ప్రతీ చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడకూడదు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.