టీటీడీ పరిధిలోకి వరద వేంకటేశ్వరాలయం
దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం అలత్తూరులోని శ్రీ వరద వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని సోమవారం ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సమక్షాన టీటీడీలో విలీనం చేశారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి అనుగ్రహంతో 1560 సంవత్సరాల పురాతనమైన అలత్తూరు శ్రీ వరద వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని టీటీడీలో విలీనం చేయడం ద్వారా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రమౌళి ఆలయానికి […]
దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం అలత్తూరులోని శ్రీ వరద వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని సోమవారం ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సమక్షాన టీటీడీలో విలీనం చేశారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి అనుగ్రహంతో 1560 సంవత్సరాల పురాతనమైన అలత్తూరు శ్రీ వరద వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని టీటీడీలో విలీనం చేయడం ద్వారా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రమౌళి ఆలయానికి సంబంధించిన రికార్డులు, ఇతర పత్రాలను టీటీడీ అధికారులకు అందజేశారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ సముదాయంలో ఈ ఆలయాన్ని చేర్చారు. కార్యక్రమంలో కార్వేటినగరం తహశీల్దార్ గౌరిశంకర్, ఆలయ డిప్యూటీ ఈవో పార్వతి, ఏఈవో దుర్గరాజు, సూపరింటెండెంట్ రమేష్ పాల్గొన్నారు.