బరిలో 1000 ఎద్దులు... గెలిస్తే కారు, ట్రాక్టర్ గిఫ్ట్

తమిళనాడులో సాంప్రదాయమైన ‘జల్లికట్టి’ యుద్ధం కొనసాగుతోంది. ...

Update: 2025-01-15 03:22 GMT
బరిలో 1000 ఎద్దులు... గెలిస్తే కారు, ట్రాక్టర్ గిఫ్ట్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు(Tamilandu)లో సాంప్రదాయమైన ‘జల్లికట్టి’(Jallikattu) యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే ఎద్దులు, యువకుల మధ్య పోరు సాగుతోంది. అయితే ఈ రోజు చెన్నై పాలమేడు(Chennai Palamedu)లో జల్లికట్టు జరిగింది. బరిలోకి 1000 ఎద్దులు(Oxes) దిగాయి . వీటితో పోటీ పడేందుకు 900 మంది యువకులు(Youth) కూడా ఢీ అంటే ఢీ అన్నారు. ఈ పోటీల్లో కొనసాగుతున్నాయి. ఎద్దులను లొంగదీసిన యువకులకు కారు, ట్రాక్టర్ బహుమతిగా  ఇవ్వనున్నారు. దీంతో ఎద్దులను లొంగదీసేందుకు యువకులు సైతం ఉత్సాహం చూపుతున్నారు.

ఎద్దులు, యువకులు రెడీ


మరోవైపు ఈ పోటీని తిలకించేందుకు అక్కడకు ప్రజలు భారీగా తరలివచ్చారు. పలుచోట్ల జరిగిన అపశ్రుతుల దృష్టా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఏదైనా ఘటన జరిగితే వెంటనే వైద్యం అందించేందుకు డాక్టర్స్ టీమ్‌ను కూడా రెడీ చేశారు. అంబులెన్సులను కూడా అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం జల్లిపట్టు ఉత్కంఠగా సాగుతోంది.

Tags:    

Similar News