Jagan: కుటుంబంతో కలిసి లండన్‌ బయల్దేరిన జగన్‌

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు సాయంత్రం లండన్ బయలు దేరాడు.

Update: 2025-01-14 14:34 GMT
Jagan: కుటుంబంతో కలిసి లండన్‌ బయల్దేరిన జగన్‌
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం(Andhra Pradesh Former CM) జగన్మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) తన కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు సాయంత్రం లండన్(London) బయలు దేరాడు. జగన్ రెండో కుమార్తె(Jagan's second daughter) వర్షారెడ్డి లండన్‌లో డీగ్రీ పూర్తి చేసింది. ఇందులో భాగంగా పట్టా ప్రదానోత్సవం(Graduation ceremony)లో కుటుంబంతో పాల్గొనేందుకు మాజీ సీఎం దంపతులు లండన్ వెళ్లారు. జగన్ తన కుటుంబంతో పాటు రెండు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. ఈ నెల చివర్లో జగన్ తిరిగి ఏపీకి చేరుకోనున్నారు. ఇదిలా ఉంటే క్విడ్ ప్రోకో కేసులకు సంబంధించి సీబీఐ(CBI) దాఖలు చేసిన కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్ షరతులతో కూడిన బెయిల్‌(Bail)పై ఉన్నారు. ఆయన విదేశాలకు వెళ్లాలంటే సీబీఐ కోర్టు(CBI Court) అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కూతురి పట్టా ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు తనకు పర్మిషన్ ఇవ్వాలని జగన్ కోర్టును ఆశ్రయించగా.. పరిగణనలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు(Nampally Court)..జగన్ కు పర్మిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.


Similar News