కనుమ రోజే బిగ్ షాక్.. తెల్లవారుజాము నుంచే హౌస్ ఫుల్ బోర్డ్స్
కనుమ రోజు మద్యం, నాన్ వెబ్ ప్రియులకు బిగ్ షాక్ తగిలింది..
దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో కనుమ(Kanuma) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భోగి(Bhogi), సంకాంత్రి(Sankranti)ని సందడిగా జరుపుకున్న ప్రజలు నేడు మందు, ముక్క వైపు పరుగులు పెడుతున్నారు. దీంతో చికెన్(Chicken), మటన్(Mutton) షాపులకు రద్దీ పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ తెల్లవారుజాము నుంచే చికెన్, మటన్ షాపుల వద్ద నాన్ వెజ్(Non Veg) ప్రియులు బారులు తీరారు. దీంతో షాపులు పూర్తిగా రద్దీగా మారాయి. చికెన్, మటన్ షాపులతో పాటు పిష్ మార్కెట్స్ కూడా కిటకిటలాడుతున్నాయి. నాటు కోళ్లు, బాయిలర్ కోళ్ల కూడా భారీగా డిమాండ్ పెరిగింది.
నాటు కోళ్లకు ఫుల్ గిరాకీ
ప్రధానంగా నాటు కోళ్లను కొనుగోళ్లు చేసేందుకు నాన్ వెజ్ ప్రియులు ఆసక్తి చూపుతున్నారు. కేజీ రూ. 900 చెబుతున్నా కొనుగోళ్లు చేస్తున్నారు. మరోవైపు లైవ్ నాటు కోళ్లను కూడా అమ్ముతున్నారు. బాయిలర్ కోళ్ల మాంసాన్ని కేజీని రూ. 300 వరకూ వ్యాపారులు చెబుతున్నారు. అయినా వెనక్కి తగ్గేది లేదని కొనుగోలు చేస్తున్నారు. కనుమ పండగ సందర్భంగా నాటు కోళ్లు భారీగా అమ్ముడు పోతున్నాయని, దీంతో పూర్తిగా దొరకడం లేదని మాంసం ప్రియులు చెబుతున్నారు.
అటు చేపలు ధరలు కూడా భారీగా పెరిగాయి. వ్యాపారులు మార్కెట్లో కేజీ రూ. 200 చెబుతున్నారని జనం అంటున్నారు. రేట్లు ఘోరంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీగా వచ్చిన జనాన్ని చూసి పలు చోట్ల ఇప్పటికే హౌస్ ఫుల్ బోర్డు పెట్టేశారు. తాము అంచనా వేసుకుని తెచ్చుకున్న కోళ్లు ఇంత త్వరగా అయిపోతాయని తాము ఊహించలేదని చెబుతున్నారు. తమ వద్ద ఉన్న కోళ్లను అమ్మిన తర్వాత తామూ కూడా కనుమ పండగను ఎంజాయ్ చేస్తామని కొందరు షాపుల యజమానులు చెబుతున్నారు.
మద్యం షాపులు కూడా రద్దీ
Big shock for alcohol and non-veg lovers
మరోవైపు మద్యం ప్రియుల రద్దీ కూడా భారీగా పెరిగింది. చికెన్, మటన్ కాంబోలో ఒక్క చుక్క మద్యం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో ఉదయం నుంచే మద్యం షాపులకు వెళ్తున్నారు. భారీగా మద్యం షాపుల వద్ద భారీగా క్యూ కట్టారు. దీంతో మద్యం షాపులు కూడా ఫుల్ రద్దీగా కనిపిస్తున్నాయి. ఈ ఒక్క రోజే భారీగా ఆదాయం వస్తుందని మద్యం షాపుల యజమానులు చెబుతున్నారు.