వివాదంలో చిక్కుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే… వీడియో వైరల్

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ భారీగా డబ్బులు పంచేందుకు సిద్ధమౌతున్నదన్న ప్రచారం జరుగుతోంది. ఎంత ఖర్చయినా సరే రెండు స్థానాలను గెలిచేలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నది. ఖమ్మం-వరంగల్-నల్లగొండ స్థానానికి టఫ్ ఫైట్ కనిపిస్తుండడంతో పట్టభద్రులకు తాయిలాలతో వల విసిరేందుకు సిద్ధమవుతున్నారు ఆ పార్టీకి చెందిన నేతలు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ‘ఖర్చులకు డబ్బులిస్తాం..’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెండ్రోజుల క్రితం వైరాలో జరిగిన ఓ సమావేశంలో ఎమ్మెల్యే […]

Update: 2021-03-13 00:48 GMT
వివాదంలో చిక్కుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే… వీడియో వైరల్
  • whatsapp icon

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ భారీగా డబ్బులు పంచేందుకు సిద్ధమౌతున్నదన్న ప్రచారం జరుగుతోంది. ఎంత ఖర్చయినా సరే రెండు స్థానాలను గెలిచేలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నది. ఖమ్మం-వరంగల్-నల్లగొండ స్థానానికి టఫ్ ఫైట్ కనిపిస్తుండడంతో పట్టభద్రులకు తాయిలాలతో వల విసిరేందుకు సిద్ధమవుతున్నారు ఆ పార్టీకి చెందిన నేతలు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ‘ఖర్చులకు డబ్బులిస్తాం..’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

రెండ్రోజుల క్రితం వైరాలో జరిగిన ఓ సమావేశంలో ఎమ్మెల్యే రాములు నాయక్ అక్కడున్నవారికి మాట్లాడారు. లిస్ట్ ను చేతిలో పట్టుకుని మనవాళ్లెవరో పైకి, కిందికి వెతికితే తెలుస్తుందని.. దాని ప్రకారం ఏ, బీ, సీ, డీ అంటూ ఓటర్లను విభజించాలని కూడా చెప్పారు. అంతేకాదు.. ఆఫ్ ద రికార్డ్ చెపుతున్నా.. డబ్బులు కూడా ఇస్తాం.. ఖర్చులకు పనికొస్తాయని, భయమేమీ లేదని చెప్పారు.. రాములు నాయక్ మాట్లాడిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా‌ మారింది. అధికార పార్టీ నేతలు పట్టభద్రులకు సైతం డబ్బులు ఎరగా వేయడాన్ని కొందరు విమర్శిస్తున్నారు.

Tags:    

Similar News