Formula E Race: రేపు సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్‌పై విచారణ
తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రేపు (బుధవారం) సుప్రీంకోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్ విచారణకు రానుంది. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టి వేయాలంటూ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన ఈ నెల 8న సుప్రీంకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎస్ఎల్‌పీ వేశారు. కేటీఆర్ పిటీషన్‌పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం విచారణ జరపనుంది.
రేపు 37వ నెంబర్‌గా కేటీఆర్ కేసు సుప్రీంకోర్టులో లిస్ట్ అయింది. అయితే, కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లక ముందే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ముందుగానే ప్రభుత్వం, ఏసీబీలు కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ ఒకవేళ పిటిషన్ వేస్తే తమ వాదనలూ వినాలని ప్రభుత్వం అందులో కోరింది.