CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు.. అసలు విషయం అదే!

ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో పాటు పలువురు మంత్రులు ఇవాళ సాయంత్రం ఢిల్లీ (Delhi)కి వెళ్లనున్నారు.

Update: 2025-01-14 07:59 GMT
CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు.. అసలు విషయం అదే!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో పాటు పలువురు మంత్రులు ఇవాళ సాయంత్రం ఢిల్లీ (Delhi)కి వెళ్లనున్నారు. బుధవారం ఉదయం 10.30కి వారంతా ఏఐసీసీ ప్రధాన కార్యాయం (AICC Head Office) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో సహా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka), టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud), ఇతర మంత్రులు ఆ కార్యక్రమానికి హాజరు కానున్నారు. బుధవారం కూడా సీఎం ఢిల్లీలోనే ఉండి రాష్ట్రంలో చేపడుతోన్న పలు అభివృద్ధి పనులకు నిధుల సమీకణ విషయంలో కేంద్ర మంత్రులను వినతులు ఇవ్వనున్నారు. గరువారం ఉదయం ఆయన నేరుగా అక్కడి నుంచి సింగపూర్ (Singapur) వెళ్లి ఈనెల 16 నుంచి 19 వరకు వివిధ ప్రాంతాల్లో పర్యటించి స్పోర్ట్స్‌ యూనివర్సిటీ (Sports University)ని సందర్శిస్తారు. 20న వరల్డ్ ఎకానమీ ఫోరమ్ (World Economic Forum) సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌ (Davos)కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు.  

Tags:    

Similar News