Koushik Reddy: నన్ను అరెస్ట్ చేయించింది అతడే.. కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు

బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Koushik Reddy)కి ఇవాళ కరీంనగర్ జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Update: 2025-01-14 07:34 GMT
Koushik Reddy: నన్ను అరెస్ట్ చేయించింది అతడే.. కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు
  • whatsapp icon

దిశ, వెబ్‌‌డెస్క్: బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Koushik Reddy)కి ఇవాళ కరీంనగర్ జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు ఆయనను విడిచి పెట్టిన వెంటనే స్టేషన్ ఆవరణలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తనను అక్రమంగా అరెస్ట్ చేయించారని ఆరోపించారు. ప్రస్తుతం రాజకీయ వ్యాఖ్యలు చేయాలంటూ కోర్టు నిబంధనలు అడ్డు వస్తున్నాయని అన్నారు. అదేవిధంగా కరీంనగర్ (Karimngar)లో ప్రెస్‌ మీట్‌ (Press Meet) పెట్టొద్దని కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నాయని తెలిపారు. పండగ పూట రాజకీయాలు మాట్లాడదలచుకోలేదని.. బుధవారం తన అరెస్ట్‌పై హైదరాబాద్‌ (Hyderabad)లో ప్రెస్‌ మీట్ (Press Meet) నిర్వహించి పూర్తి వివరాలు చెబుతానని కౌశిక్‌రెడ్డి అన్నారు. తనను అరెస్ట్ చేశారని తెలియగానే తనకు మద్దతు తెలిపిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

కాగా, కరీంనగర్‌ (Karimnagar)లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన ఓ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్‌ (MLA Sanjay)తో పాడి కౌశిక్‌రెడ్డి (Padi Koushik Reddy) ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే సంజయ్‌ (MLA Sanjay)పై దాడి చేశారంటూ ఆయన పీఏ (PA), సమావేశంలో గందరగోళం సృష్టించారంటూ స్థానిక ఆర్డీవో (RDO) కరీంనగర్‌ (Karimngar) వన్‌ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి (MLA Koushik Reddy)పై వివిధ సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు చేశారు. అనంతరం ఆయనను సోమవారం సాయంత్రం జూబ్లీ‌హిల్స్ (Jubilee Hills) పోలీస్ స్టేషన్‌లో అరెస్ట్ చేసి కరీనంగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Tags:    

Similar News