Turmaric Board: జాతీయ పసుపు బోర్డు ప్రారంభం.. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు

సంక్రాంతి (Sankranti) పర్వదినం వేళ నిజామాబాద్‌ (Nizamabad)లో జాతీయ పసుపు బోర్డు (National Turmaric Board) కార్యాయలయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ (Piyush Goyal) ఢిల్లీ (Delhi) నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.

Update: 2025-01-14 06:55 GMT
Turmaric Board: జాతీయ పసుపు బోర్డు ప్రారంభం.. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఎట్టకేలకు నిజామాబాద్ పసుపు రైతు కల ఫలించింది. సంక్రాంతి (Sankranti) పర్వదినం వేళ నిజామాబాద్‌ (Nizamabad)లో జాతీయ పసుపు బోర్డు (National Turmaric Board) కార్యాయలయాన్ని ఇవాళ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ (Piyush Goyal) ఢిల్లీ (Delhi) నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఆయన వెంట నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) కూడా ఉన్నారు.

ఇప్పటికే పసుపు బోర్డు చైర్మన్‌గా ఆర్మూర్ జిల్లా వాసి పల్లె గంగారెడ్డి (Palle Ranga Reddy)ని కేంద్రం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇవాళ ఆయన బాధ్యతలను స్వీకరించారు. బోర్డు ప్రారంభోత్సవం సదర్భంగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ (Piyush Goyal) ఢిల్లీ (Delhi)లో మీడియాతో మాట్లాడుతూ.. పసుపు బోర్డును సరైన దిశలో నడిపించాలని అన్నారు. పల్లె గంగారెడ్డి (Palle Ganga Reddy)పై బృహత్తర బాధ్యతను పెట్టామని తెలిపారు. సంక్రాంతి పర్వదినం రోజున పసపు రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) పసుపు బోర్డును గిఫ్ట్‌గా ఇచ్చారని కామెంట్ చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా మోడీ ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును ఏర్పాటు చేశారని కొనియాడారు. ఈ నేపథ్యంలో ప్రధానికి తాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. తెలంగాణ (Telangana)తో సహా మొత్తం 20 రాష్ట్రాల్లో మొత్తం 30 రకాల పసుపును పండిస్తు్న్నాయని.. పసుపు బోర్డు కోసం 40 ఏళ్లుగా రైతులు పోరాటం చేశారని అన్నారు. నేడు ఆ రైతుల జీవితాల్లో నేడు ప్రధాని మోడీ వెలుగులు నింపారని తెలిపారు.        


Similar News