భయపడొద్దు.. కరోనా నివారణకు టీకా తప్పనిసరి : బండి సంజయ్
దిశ, కరీంనగర్ సిటీ : కొవిడ్ సెకండ్ వేవ్ కరీంనగర్ జిల్లాలో వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రజలంతా స్వీయ నియంత్రణ పద్ధతులు పాటించి, తమను తాము రక్షించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని ఆర్టీసీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన టీకా శిబిరానికి బండి వచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న టీకాలను ప్రతి ఒక్కరూ వేయించుకోవాలన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న […]
దిశ, కరీంనగర్ సిటీ : కొవిడ్ సెకండ్ వేవ్ కరీంనగర్ జిల్లాలో వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రజలంతా స్వీయ నియంత్రణ పద్ధతులు పాటించి, తమను తాము రక్షించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని ఆర్టీసీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన టీకా శిబిరానికి బండి వచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న టీకాలను ప్రతి ఒక్కరూ వేయించుకోవాలన్నారు.
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మహమ్మారిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందని, దేశవ్యాప్తంగా రెండు డోసుల టీకాలను ఉచితంగా ప్రతి ఒక్కరికీ వేయడానికి, ప్రణాళికతో ముందుకు వెళుతుందన్నారు. కొవిడ్ నుండి రక్షణ కల్పించే టీకాలను ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని ఆ సమయంలో ఎలాంటి భయాందోళన, అపోహలకు పోకూడదని తెలిపారు.