12-15 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నారు. అయితే చిన్నపిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ అందించే విషయంపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక ఔషధ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. చిన్నపిల్లలపై క్లీనికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. చిన్నపిల్లలపై క్లీనికల్ ట్రయల్స్ సక్సెస్ అవ్వగా.. పంపిణీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా 12-15 ఏళ్ల పిల్లలకు ఫైజర్ టీకా ఇచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. క్లీనికల్ ట్రయల్స్ సక్సెస్ అయిన […]

Update: 2021-06-04 05:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నారు. అయితే చిన్నపిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ అందించే విషయంపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక ఔషధ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. చిన్నపిల్లలపై క్లీనికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. చిన్నపిల్లలపై క్లీనికల్ ట్రయల్స్ సక్సెస్ అవ్వగా.. పంపిణీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో తాజాగా 12-15 ఏళ్ల పిల్లలకు ఫైజర్ టీకా ఇచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. క్లీనికల్ ట్రయల్స్ సక్సెస్ అయిన అనంతరం వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపింది. అటు ఇండియాలోనే కూడా చిన్నపిల్లలపై కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. మూడో వేవ్ చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందనే వార్తల క్రమంలో ట్రయల్స్ మరింత వేగవంతం చేశారు.

2-18 ఏళ్ల మధ్య వయస్సున చిన్నపిల్లలపై కొవాగ్జిన్ వ్యాక్సిన్ క్లీనికల్ ట్రయల్స్ భారత్ బయోటెక్ నిర్వహిస్తోంది. ఇటీవల పట్నాలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 525 మంది చిన్నపిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Tags:    

Similar News