వారందరికీ టీకాలు వేయండి: మోడీ
లక్నో : ప్రధాని ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి (ఉత్తరప్రదేశ్) లో 45 ఏండ్లు దాటిన వారికీ టీకాలను వేయాలని స్థానిక అధికారులను మోడీ ఆదేశించారు. వారణాసిలో కొవిడ్ వైరస్ విజృంభణ నేపథ్యంలో ఆదివారం ఆయన స్థానిక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ స్పందిస్తూ.. 45 ఏళ్ల పైబడినవారందరికీ టీకా వేయాలని, ఆ విధంగా అధికారులు సమాయత్తం కావాలని సూచించారు. వారణాసిలో పరిస్థితులపై తాను ఎప్పటికప్పుడూ తెలుసుకుంటున్నానని, గడిచిన ఐదేళ్లుగా కల్పించిన ఆరోగ్య సదుపాయాల […]
లక్నో : ప్రధాని ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి (ఉత్తరప్రదేశ్) లో 45 ఏండ్లు దాటిన వారికీ టీకాలను వేయాలని స్థానిక అధికారులను మోడీ ఆదేశించారు. వారణాసిలో కొవిడ్ వైరస్ విజృంభణ నేపథ్యంలో ఆదివారం ఆయన స్థానిక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ స్పందిస్తూ.. 45 ఏళ్ల పైబడినవారందరికీ టీకా వేయాలని, ఆ విధంగా అధికారులు సమాయత్తం కావాలని సూచించారు. వారణాసిలో పరిస్థితులపై తాను ఎప్పటికప్పుడూ తెలుసుకుంటున్నానని, గడిచిన ఐదేళ్లుగా కల్పించిన ఆరోగ్య సదుపాయాల విస్తరణ, ఆస్పత్రులలో కల్పించిన సౌకర్యాలతో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని మోడీ చెప్పారు.
కరోనా మొదటి దశలో అనుసరించిన టెస్ట్, ట్రాక్, ట్రీట్ ను ఈసారీ అమలుచేయాలని స్థానిక అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వారణాసి ఆస్పత్రులలో పడకలు, ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సిన్ ప్రక్రియ తదితర అంశాలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దేశంలోని వైద్య సిబ్బందికి ప్రధాని మరోమారు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా ఫస్ట్ వేవ్ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సెకండ్ వేవ్ లో అత్యంత జాగురూకతతో వ్యవహరిస్తున్నారని కొనియాడారు.