bomb threats: ఈ ఏడాదిలో దాదాపు వెయ్యి బూటకపు కాల్స్- కేంద్రమంత్రి మురళీధరన్ మెహోల్

ఇటీవల పలు భారత విమానయాన సంస్థలకు వరుస బాంబు బెదిరింపులు (bomb threats) కలకలం రేపాయి. అయితే, ఈ అంశంపై పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చర్చకు వచ్చింది.

Update: 2024-11-27 10:58 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల పలు భారత విమానయాన సంస్థలకు వరుస బాంబు బెదిరింపులు (bomb threats) కలకలం రేపాయి. అయితే, ఈ అంశంపై పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ (Murlidhar Mohol) మాట్లాడుతూ 2024లో ఇప్పటివరకు భారత విమానయాన సంస్థలకు 994 బూటకపు బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలిపారు. 2022 నుంచి 2024 నవంబర్‌ 13 వరకు మొత్తం 1,143 బెదిరింపులు వచ్చాయని వెల్లడించారు. కాగా.. క్రమంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, థ్రెట్ కాల్స్ చేస్తున్న వారి లొకేషన్‌ గురించి సరైన సమాచారం తెలియకపోవడంతో దర్యాప్తు ఆలస్యమవుతోందన్నారు. ఇలాంటి చర్యలను కట్టడి చేయడానికి పౌర విమానయాన భద్రత మండలి(BCAS), ఏవియేషన్ సెక్యూరిటీ రెగ్యులేటర్ కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కేసులపై దర్యాప్తు చేయడం కోసం బాంబు థ్రెట్ అసెస్‌మెంట్ కమిటీ (BTAC)ని ఏర్పాటు చేశామన్నారు.

వరుస బెదిరింపులు

ఇటీవల భారత్‌కు చెందిన విస్తారా, ఎయిరిండియా, ఇండిగో, ఆకాశ ఎయిర్, స్పైస్‌జెట్, స్టార్‌ఎయిర్, అలయన్స్‌ ఎయిర్‌ సహా వివిధ భారతీయ విమానయాన సంస్థలకు వరుసగా బూటకపు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులతో ప్రయాణికులు, ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీంతో పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. బూటకపు బెదిరింపులకు పాల్పడిన పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

Tags:    

Similar News