Sanatan Dharm : ‘సనాతన ధర్మ రక్షా బోర్డ్’‌ ఏర్పాటుకు ఆదేశాలివ్వలేం : ఢిల్లీ హైకోర్టు

దిశ, నేషనల్ బ్యూరో : సనాతన ధర్మాన్ని(Sanatan Dharm) అనుసరించే వారిపై అన్య మతస్తులు దాడులు చేస్తే రక్షించేందుకు ‘సనాతన ధర్మ రక్షా బోర్డ్’‌(Sanatan Dharm Raksha Board)ను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) కొట్టివేసింది.

Update: 2024-11-27 12:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో : సనాతన ధర్మాన్ని(Sanatan Dharm) అనుసరించే వారిపై అన్య మతస్తులు దాడులు చేస్తే రక్షించేందుకు ‘సనాతన ధర్మ రక్షా బోర్డ్’‌(Sanatan Dharm Raksha Board)ను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) కొట్టివేసింది. ‘సనాతన హిందూ సేవా సంఘ్ ట్రస్ట్’ అనే సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను విచారించే క్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ సారథ్యంలోని బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది.

‘‘ఇలాంటి పిటిషన్ల విషయంలో మేం ఏమీ చేయలేం. ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేయలేం. కావాలంటే మీరు నేరుగా ప్రభుత్వాన్ని సంప్రదించండి. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే వాళ్ల ఎంపీలు ఆ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతారు’’ అని పిటిషనర్‌కు న్యాయస్థానం సూచించింది. ఇలాంటి ట్రస్ట్‌లను ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాల పరిధిలోకి వస్తుందని పేర్కొంది. అందుకే సనాతన హిందూ సేవా సంఘ్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని తాము ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు బెంచ్ తేల్చి చెప్పింది. ఇతర మతాల్లోనూ ఈవిధమైన పరిరక్షణ బోర్డులు ఉన్నాయంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది చేసిన వాదనలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు.

Tags:    

Similar News